ఆంధ్రప్రదేశ్
ఈనెల 18 నుంచి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం సభ్యత్వ నమోదులో కొత్తపేట ముందంజలో ఉండాలి కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పిలుపు
రిపోర్టర్ : జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
రావులపాలెం మండలం
సభ్యత్వ నమోదులో కొత్తపేట ముందంజలో ఉండాలి కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పిలుపు
రావులపాలెం జనసేన పార్టీ సభ్యత్వం నమోదులో కొత్తపేట నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉండేలా కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత నమోదు పై రావులపాలెంలో ఆదివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
సమావేశంలో నియోజవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 18 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని పది రోజుల ఎవరిలో సభ్యత్వం నమోదు పూర్తి చేయాలని సభ్యత్వ నమోదు వాలంటీర్లను కోరారు. సభ్యత్వం నమోదులో అధిక శాతం వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తులు పని చేసుకున్న వారికి నమోదు చేయాలని ఆయన సూచించారు. ప్రతి వాలంటీర్ 200 సభ్యత్వాలు తక్కువ కాకుండా నమోదు చేయాలన్నారు. సభ్యత్వ నమోదులో నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత సమయంలో టార్గెట్లను పూర్తి చేయాలని బండారు శ్రీనివాస్ కోరారు.
*కష్టపడే కార్యకర్తకు ఎప్పుడు గుర్తింపు ఉంటుంది.*


పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ప్రతీ కార్యకర్త నాయకులు కష్టపడి పని చేశారని దీంతో రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక మెజార్టీలతో విజయం సాధించిన సంగతి తెలిసిందేనని అయితే ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీలో జనసేన పార్టీ నాయకులకు సముచిత స్థానం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్టీలో కష్టపడిన అందరికీ ఒకేసారి పదవులు రావడం కష్టమని అయితే దశలవారీగా వారి వారి స్థాయిలను బట్టి నామినేటెడ్ పదవులు లభిస్తాయని బండారు శ్రీనివాస్ అన్నారు.
ఈ సమావేశంలో కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సలాది రామకృష్ణ, పల్లికొండ సుధీర్, దొంగ సుబ్బారావు, బొక్క ఆదినారాయణ, సలాది జయప్రకాశ్ నారాయణ, సూరపరెడ్డి సత్య, తోట స్వామి, కంఠంశెట్టి చంటి, కాకులపాటి సత్య, కొత్తపల్లి నగేష్, తమ్మన భాస్కర్ రావు, తోట వెంకటేశ్వర్లు, కార్యకర్తలు వీర మహిళలు,తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466