ఆంధ్రప్రదేశ్
విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలి జర్నలిస్టుల నిరసన పోలీసులకు ఫిర్యాదు
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కోత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
*జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన పోలీసులకు ఫిర్యాదు*
*సంఘీభావం తెలిపిన పలు పార్టీల నాయకులు*
కొత్తపేట నియోజకవర్గ జర్నలిస్టులు కొత్తపేట పంచాయతీ కార్యాలయం వద్ద నుండి పోలీస్ స్టేషన్ వరకు మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేస్తూ కొత్తపేట పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం విజయసాయి రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ముత్యాల బాబ్జి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకం ప్రభుత్వ వ్యవస్థ న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ తో పాటు మీడియా వ్యవస్థ నాలుగు స్తంభంగా ఏర్పడి ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుంటుంది
అటువంటి మీడియా వ్యవస్థ అందులో పని చేసే జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో వాటి పరిష్కారంలో మీడియా పాత్ర ఎనలేనిది
స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత ఈ భారతదేశ ప్రగతిలో మీడియా పాత్ర అద్భుతం
అటువంటి మీడియా వ్యవస్థపై వ్యక్తిగతంగా తమకు ఏదో నష్టం జరిగిందని వ్యక్తిగత కక్షలతో కొంతమంది రాజకీయ నాయకులు వ్యవస్థలను జర్నలిస్టులను దూషించడం పరిపాటిగా మారింది
ప్రత్యేకంగా ఒక వార్త ఎవరైనా ఇస్తే దానిలో విషయాలను ప్రచురించడం లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడం మీడియా బాధ్యత ఆ బాధ్యత నిర్వహణలో వారు వెళుతుంటే దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని తను చేసిన పనికి వారే బాధ్యులంటూ ఈరోజు మీడియా సంస్థలపై ప్రతినిధులపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దూషించడం కోట్లాదిమంది తెలుగు ప్రజలు టీవీ చానల్స్ ద్వారా చూస్తున్నారని
ఇటువంటి నీతి బాహ్యమైన చర్యలను ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఖండించాలని మీడియాపట్ల విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరు రాజ్యసభ సభ్యత్వానికి భంగం కలిగించే విధంగా ఉందని విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి పార్లమెంటు వంటి చట్టసభల్లో కూర్చోవడానికి అనర్హుడని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై ప్రభుత్వం తను ఉన్న రాజకీయ పార్టీ చర్యలు తీసుకోవాలని పార్టీ నుంచి బహిష్కరించడం కాకుండా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులతో పాటు పలు పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం లో పాల్గొన్నారు జర్నలిస్టు లకు మద్దతు తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87305