ఆంధ్రప్రదేశ్
ప్రమాదానికి గురైన కార్యకర్తలకు జనసేన ఆర్థిక భరోసా బీమా చెక్కుల పంపిణీ
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం
ఆలమూరు మండలం
పెదపళ్ల, సందిపూడి గ్రామాలలో ప్రమాదాలకు గురైన జన సైనికులకు చెక్కులను కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పంపిణీ చేశారు

జనసేన పార్టీ సభ్యత్వంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు ఏ కారణం చేతనైనా ప్రమాదాలు సంభవిస్తే వారికి పార్టీ ఆర్థిక భరోసాగా నిలుస్తుందని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. ఏ రాజకీయ పార్టీ లోను లేని ఈ విధానాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఎంతోమందికి ఆర్థిక భరోసా కల్పించారన్నారు. కొత్తపేట నియోజకవర్గ ఆలమూరు మండలం పెదపళ్ల, సందిపూడి గ్రామాలకు చెందిన జనసైనికులు ప్రమాదాలకు గురైన వారికి బండారు శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రమాద బీమా చెక్కులను శుక్రవారం అందజేశారు. జనసేన పార్టీలో క్రియోశీలక సభ్యత్వం ఉన్న వారికి ఏ కారణం చేతనైనా ప్రమాదం సంభవించి మృతి చెందితే వారికి రూ.5 లక్షలు, ప్రమాదం లో గాయపడిన వారికి రూ. 50,000 వరకు బీమా అందిస్తుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా పెదపళ్లలో ముగ్గురికి సంధిపూడిలో ఒకరికి చెక్కులు పంపిణీ చేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ క్రియోశీలక సభ్యత్వ నమోదు జరుగుతుందని సభ్యత్వం స్వీకరించాలని వారు పార్టీ నాయకులను సంప్రదించాలని ఆయన సూచించారు. సభ్యత్వ నమోదు అధికంగా తాపీ మేస్త్రీలు ఇతర చేతి వృత్తి పనివాళ్ళు కు ఎక్కువ అవకాశం ఇవ్వాలని బండారు శ్రీనివాస్ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సంగీత సుభాష్, సూరపరెడ్డి సత్య, తోట వెంకటేశ్వర్లు, నల్లా వెంకన్న, గారపాటి త్రిమూర్తులు, సలాది జై ప్రకాష్ నారాయణ (జెపి) మాకినీడి బాబి, గుత్తుల దుర్గాప్రసాద్, డిపి రావు, గారపాటి శ్రీనివాస్, నాగిరెడ్డి వెంకటేశ్వరరావు తమ్మన భాస్కరరావు, పడాల అమ్మిరాజు, పెద్దిరెడ్డి పట్టాభి, గుత్తుల నాగేశ్వరరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదుపై బండారు సమీక్ష..
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై ఆలమూరు మండల జనసేన పార్టీ నాయకులతో శుక్రవారం నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ సమీక్షించారు. ఈనెల 28 లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని కోరారు. సభ్యత్వ నమోదు వాలంటీర్లుగా ఉన్న వారు త్వరితగతిన అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయాలని శ్రీనివాస్ కోరారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68061