ఆంధ్రప్రదేశ్
రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటాం కొత్తపేట ఎమ్మెల్యే బండారు
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం
ఆలమూరు మండలం
రైతులకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు

భారీ వర్షాలతో నష్టాల పాలైన రైతుల్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు.
శనివారం ఆలమూరు మండలం పెనికేరు, మోదుకూరు, గుమ్మిలేరు, ఆలమూరు గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను ఆయన పరిశీలించారు.
మోకాలి లోతులో నీరు నిలిచిపోయిన పంట పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడి వారి కష్టనష్టాలను తెలుసుకొని భరోసా అందించారు ముంపు నీరు పంట పొలాల నుంచి బయటకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
భారీ వర్షాల వల్ల ఏర్పడిన నష్టాన్ని వచ్చే శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెoనాయుడుల దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు. వర్షాల వల్ల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది గనుక ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కాచిన నీటిని తాగడం, పరిశుభ్రత పాటించడం చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465