ఆంధ్రప్రదేశ్
పెద్దింటి రామం కు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీ ప్రశంసల జల్లు

రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
ఇంటి పేరు పెద్దింటి కానీ పేదింటి రామం
అవార్డులు రివార్డులలో అతనికి సరిలేరెవ్వరు !
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట కు చెందిన పురోహితులు పెద్దింటి రామం ఆధ్యాత్మిక సేకరణలు పూల మొక్కల సేకరణలు పంచాంగ సేకరణలు 8లక్ష ల బియ్యపు గింజల పై జాతీయ జెండాలు,చెక్కి 94 ప్రపంచ రికార్డులు సాధించి బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తనకంటు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
ఈ రోజున పౌరహిత్యం, జ్యోతిష్యం, అంటే అది ఒక వ్యాపారంగా మారిపోయింది జ్యోతిష్యం, పూజలు, హోమాలు పేరుతో వేలల్లో లక్షల్లో సంపాదిస్తున్నారు కానీ రామం అలా చేయలేదు.
తన పేరును డబ్బుతో కాదు నిజాయితీ తో నిస్వార్ధంగా సేవ చేసి సంపాదించాలి అనుకున్నారు తన దగ్గరకు వచ్చిన నలుగురికి తనకు తోచిన సహాయ సహకారాలు చేస్తూ సలహాలు అందిస్తూ ఫలితం ఆశించకుండా వారి అభివృద్ధికి సహాయపడతారు.
సోషల్ మీడియా ద్వారా పెద్దింటి రామం గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాజమండ్రి ఎస్పీ కేఎన్ రావు పెద్దింటి రామం స్వగృహాన్ని సందర్శించారు.
రామం సేకరించిన వస్తువులను పూల మొక్కలను రామం కు వచ్చిన అవార్డులను ఆసక్తిగా తిలకరించారు.
ఎస్పీ కేఎన్ రావు రామం ను ఉద్దేశించి మాట్లాడుతూ…
ఆధ్యాత్మిక శోభ పరిడవించే మీ దేవతా గృహాన్ని సందర్శించటం నాకు చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు రామం సేకరించిన అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంపద వర్ణనాతీతం అని కొనియాడారు.
అదేవిధంగా పెరట్లో రామం పెంచుతున్న వివిధ రకాల వృక్ష సంపద, దేవతా వృక్షాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఇటువంటి సేవా నిరతి, సమాజ సేవ కలిగి ఉండటం చాలా ప్రశంసనీయంఅని అభినందించారు.
ఈ సందర్భంగా పెద్దింటి రామం మాట్లాడుతూ…
ముందుగా తనను అభినందించడానికి రాజమండ్రి నుంచి తమ స్వగృహానికి విచ్చేసిన ఎస్పీ కే ఎన్ రావు కి ధన్యవాదాలు తెలియజేశారు తనకు వస్తు సేకరణ ఆధ్యాత్మిక సేవ అంటే తనకు ఇష్టమని ఎప్పటికైనా పురాతన వస్తువులు పంచాంగాలు పుస్తకాలు రుద్రాక్షలు కనుమరుగవుతున్న వస్తువులను సేకరించి ఒక మ్యూజియం ఏర్పాటు చేసి రాబోయే తరాల వారికి వాటి విశిష్టత తెలియజేసేలా చేయడమే తన లక్ష్యం అని తెలిపారు ఇప్పటికే దానికోసం సుమారు 1000 రకాల వస్తువులను సేకరించానని తెలిపారు ఇప్పటికీ తాను అద్దె గృహంలో నివసిస్తున్నానని తరుచూ ఇల్లు మారవలసి రావడం వల్ల చాలా వస్తువులు పోగొట్టుకున్నానని తెలిపారు భవిష్యత్తులో ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే తాను వీటన్నిటిని ఒక మ్యూజియం గా ఏర్పాటు చేసి భవిష్యత్తు తరాల కోసం భద్రపరుస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక