ఆంధ్రప్రదేశ్
కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
కోనసీమ అనగానే కొబ్బరి ఉత్పత్తికి ప్రధాన కేంద్రమని, నాణ్యమైన కొబ్బరిని ఉత్పత్తి చేయడంలో ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంటుందని, ఎన్డీఏ ప్రభుత్వం రైతుల నుండి కొబ్బరిని (కోప్రా) కనీస మద్దతు ధరలకు మార్కెట్ యార్డ్ ల ద్వారా కొనుగోలు చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మార్కెట్ యార్డ్ లో శనివారం కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాసు, ఏపీ ఆయిల్ ఫెడ్ ఇన్చార్జ్ మేనేజర్ యు సుధాకర్ లతో కలిసి నాఫెడ్ – ఆయిల్ ఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొబ్బరి రైతులకు లాభాలు సమకూర్చాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం కొప్రా కొనుగోలు కేంద్రాలను నెలకొల్పిందని, మన రాష్ట్రంలో కొప్రా కనీస మద్దతు ధర రూ.11.160లు, బాల్ కోప్రా కనీస మద్దతు ధర రూ.12,000లుగా నిర్ణయించుగా, ఇప్పటి వరకు జిల్లాలో అంబాజీపేటలో మాత్రమే ఉన్న కొనుగోలు కేంద్రాన్ని రైతుల సౌకర్యార్థం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేటతో పాటు కొత్తపేట, ముమ్మిడివరం మార్కెట్ యార్డులలో కొప్రా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు వెల్లడించారు.
ఈ కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలు గోడౌన్లు, తూకాలు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రభుత్వం మార్కెట్ యార్డల ద్వారా కోప్రా ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను కొబ్బరి రైతులు ఉపయోగించుకుని మద్దతు ధరతో లాభాలు పొందవచ్చునని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బూసి జయ లక్ష్మి భాస్కరావు, మార్గాన గంగాధర్, గుడపాటి రమాదేవి, ధరణాల రామకృష్ణ, కంఠంశెట్టి శ్రీనివాస్, పాలూరి సత్యనందం, కంఠంశెట్టి చంటి, వాసంశెట్టి సత్యనారాయణ, ఎన్డీఏ కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక