ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ధ్వంస రచనలు.. పెద్ద సైకో చంద్రబాబు – చిన్న సైకో లోకేష్.. చిర్ల జగ్గిరెడ్డి
 
																								
												
												
											రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
అంబేద్కర్ మహనీయుని ప్రాంగణంలో అవమానకర సంఘటన హేయమైన చర్య…గొల్లపల్లి డేవిడ్ రాజ్.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పాత బస్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గరెడ్డి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు అంటే అభివృద్ధి అని ప్రజల చెవిలో పువ్వులు పెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, సంఘవిద్రోహ కార్యక్రమాలు అడ్డు అదుపూ లేకుండా జరుగుతున్నాయి అని మాజీ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.

విజయవాడ నడి బొడ్డులోని డా. బి.ఆర్.అంబేద్కర్ ప్రాంగణంలో జరిగిన అవమానకర చర్యను ఖండిస్తూ చిర్ల ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో నిరసన తెలియచేశారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి రాష్ట్రంలో ధ్వంస కాండ తారా స్థాయికి చేరింది అని, చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందివ్వడం మానేసి 7,000 కోట్ల రూపాయల ఖజానాతో పరిపాలన ప్రారంభించి నేడు రాష్ట్రంలో ఖజానా కాళీ అని మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో సుభిక్షంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీహార్ తరహా హత్యా రాజకీయలకు తెరతీశారని అన్నారు.
విజయవాడ నడిబొడ్డులో అత్యంత సుందరంగా ఏర్పాటు చేసిన మహనీయుడు డా.బి.ఆర్.అంబేద్కర్ ప్రాంగణంలో మునిసిపల్ అధికారుల కనుసన్నల్లోనే శిలాఫలకాలు ధ్వంసం చెయ్యడం హేయమైన చర్య అని చిర్ల అన్నారు. ఎస్సిలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని అన్న తమరికి ఇంతకు మించి సంస్కారం ఏముంటుంది అని చిర్ల ఎద్దేవా చేశారు.
ఇచ్చిన హామీలు అమలు గాలికి వదిలేసి, తెలుగు తమ్ముళ్లను గూండాలుగా, రౌడీలుగా తీర్చిదిద్దుతున్న పెద్ద సైకో చంద్రబాబు, చిన్న సైకో రెడ్ బుక్ రాజ్యాంగఅధినేత లోకేష్ అని చిర్ల అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన పోలీసుల కళ్ళముందే ఇళ్లలో ఉన్న వారిని రోడ్ల మీదకు లాగి హత్యలు చేయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చిర్ల అన్నారు.
అంబేద్కర్ లాంటి మహనీయుని ప్రాంగణంలో ధ్వంస కాండ క్షమించారనిది అని, పక్కనే ఉన్న 17 కోట్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఉన్న విధ్వంస పరిస్థితులు మన దేశంలో ఉండకూడదని ఎంతో ముందు చూపుతో అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారు అని, అలాంటి మహనీయుడి ప్రాంగణంలో ఇలాంటి చర్యలు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ప్రజాలందరిపై ఉందని అన్నారు.
ఇలాంటి చర్యలు ఇప్పటికైనా మానుకోకపోతే చంద్రబాబు అండ్ కో భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది అని హెచ్చరించారు.
- 
																	   జాతీయం7 months ago జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో) 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం 
- 
																	   ఆంధ్రప్రదేశ్6 months ago ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక 





 Total Users : 67951
 Total Users : 67951