ఆంధ్రప్రదేశ్
ప్రియదర్శినీ బాలవిహార్ లో తొలి అంతరిక్ష దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం లో గల ప్రియదర్శిని బాలవిహార్ కాన్వెంట్ లో ఈరోజు భారతదేశ తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. అంతరిక్ష విజ్ఞానాన్ని కలిగించే రాకెట్లు, ఉపగ్రహాల నమూనాలతోనూ, శాస్త్రవేత్తల చిత్రపటాలతోనూ పిల్లలు స్పేస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసారు.
విద్యార్థులు అనేక చిత్రాలను గీసి ప్రదర్శించారు. అనేక మంది చిన్నారులు చంద్రయాన్ – 3 విజయాలను గురించి, అంతరిక్షం గురించి అనేక విషయాలను ప్రసంగించారు.
కరస్పాండెంట్ బుద్ధచంద్రదేవ్ సైన్స్, టెక్నాలజి, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) ప్రాముఖ్యతను వివరించారు.
అకడమిక్ డైరెక్టర్ అద్దంకి సాహిత్య చంద్రుని దక్షిణ ధృవం పై మొదటిసారి విక్రమ్ ల్యాండర్ ను దింపిన దేశం మనదేననీ, అందుకు మనం గర్వించాలనీ చెప్పారు. చంద్రుని పై పగటి కాలం 15 రోజులు అని విక్రమ్ లాండర్ పగటికాలమంతా పని చేసి సెప్టెంబర్ 3 న ఆగిందని తిరిగి రాత్రి కాలం (-120°) పూర్తయ్యాక స్పందించలేదని వివరించారు.
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎఎస్సార్ మూర్తి పిల్లలు తమతో బాటు తమ తల్లిదండ్రులకు కూడా శాస్త్రీయ విజ్ఞానం తెలిసేలా ఉన్నతంగా చదువుకోవాలన్నారు.
అనంతరం పిల్లలు డిజి క్లాసులో అంతర్జాలంలో అంతరిక్ష విజ్ఞానంపై పలు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక