ఆంధ్రప్రదేశ్
మరపురాని మనిషి… శాంతారామ్ జె.పవార్
శ్రీకాళహస్తి ఆగస్టు 25:
శ్రీకాళహస్తిలో మరపురాని మనిషి శాంతారామ్ జె.పవార్ అని పలువురు అన్నారు. ఆదివారం 71 వ జయంతిని ద స్కూల్ ఆవరణలో ఆయన కుమార్తె డాక్టర్ అర్చన, సోదరులు జనార్దన్ రావు పవార్ సారథ్యంలో ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ద స్కూల్ ఆవరణలో ఉన్న ఆయన శిలావిగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విచ్చేసిన పలువురు మాట్లాడుతూ, సమాజంలో శ్రీకాళహస్తిలో అందరి హృదయాల్లో శాశ్వత స్థానం సాధించిన మిత్రులు శాంతారామ్ జె.పవార్ ఒక్కరే అన్నారు. అలాంటి నాయకుడు ఇక లేడు, రారని అన్నారు. ఆయన జనంతో మమేకమైన తీరు ఎన్నటికీ మరువరానిదని అన్నారు. రాజకీయంగా, ఆధ్యాత్మికంగా కుల మతాలకు అతీతంగా రాణించిన ఆయన విద్యాపరంగా సేవలందించడం అభినందనీయమని, నేడు మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, స్నేహ భావం విడదీయరానిది అన్నారు. ఈ కార్యక్రమంలో ద స్కూల్ కరస్పాండెంట్ జనార్దన్ రావు వి పవార్, హెచ్ఎం విశాల, పట్టణ ప్రముఖులు గాజుల సత్యనారాయణ, టౌన్ బ్యాంకు చైర్మన్ శెట్టిపల్లి సురేష్, శెట్టిపల్లి సుబ్రహ్మణ్యం, ఆవుల జయరాం, రాము, ప్రతాప్ రావు పవార్, పరమేశ్వరరావు పవార్ మధు, మాజీ కౌన్సిలర్ మహబూబ్ బాషా పలువురు సన్నిహితులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87482