ఆంధ్రప్రదేశ్
బాలీవుడ్ నటిని విజయవాడ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు ?
విజయవాడ :
పోలీస్ మాఫియా సెటిల్మెంట్ కి పరాకాష్ట ఈ సంఘటన. (Telugu360 has independently verified the FIR )
2024 ఫిబ్రవరి 2వ తేదీన ఓ బాలీవుడ్ నటి ( Kadambari Jetwani) కుటుంబం మొత్తాన్ని అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు
ఆ నటి .. ఓ కృష్ణ జిల్లా వ్యక్తిని ..ఓ పార్టీలో పరిచయమై ట్రాప్ చేసి రూ. ఐదు లక్షలు వసూలు చేశారని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు పోలీసులు. ఫిర్యాదు వచ్చిన కాసేపటికే అరెస్టు చూపించారు పోలీసులు. ఇంత వేగం ఎలా సాధ్యమయింది ? అసలు ఆ నటి కుటుంబం అరెస్టు చేయడం వెనుక ఏం జరిగింది ?
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు :
కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన ఆ ఇండస్ట్రియలిస్ట్ కుమారుడు, ఈ బాలీవుడ్ నటి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అది అతని కుటుంబానికి ఇష్టం లేదు. పెళ్లిని ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యాక.. వైసీపీ సర్కార్ లో పోలీసు శాఖను గుప్పిట్లో పెట్టుకున్న ఒక వ్యక్తిని సంప్రదించాడు. 5 కోట్ల డీల్ మాట్లాడుకున్నాడు. అతను విజయవాడ పోలీసు ఉన్నతాధికారికి ఈ సెటిల్మెంట్ బాధ్యత అప్పగించాడు.
నేరుగా పది మంది సిబ్బందితో నవీ ముంబయికి పోయి ఆ నటీమణి కుటుంబం మొత్తాన్ని విజయవాడ తీసుకొచ్చారు ఆ పోలీసు అధికారి. ఓ గెస్టహౌస్ లో పెట్టి చిత్రహింసలు పెట్టారు. ఆ ఇండస్ట్రిలియస్ట్ కుటుంబాన్ని వదిలేయాలన్నారు. ఒప్పుకోకపోవడంతో రూ. ఐదు లక్షల చీటింగ్ కేసు పెట్టించి జైలుకు పంపారు. తర్వాత రాజీకి వచ్చి పెళ్లి విషయంలో వెనక్కి తగ్గడంతో బెయిల్ కూడా పోలీసులే ఇప్పించి పంపేశారు.
ఇదే నిజమైతే.. ఏపీ పోలీసు వ్యవస్థ మాఫియాను మించి పని చేసిందని అనుకోవాల్సిందే. ఈ వ్యవహారంలో ప్రస్తుత ఏపీ పోలీసులు నిజాలని బయట పెట్టాలన్నది సాధారణ ప్రజల డిమాండ్.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68093