ఆంధ్రప్రదేశ్
విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే విద్యుత్ అమరవీరులకు అర్పిస్తున్న నిజమైన నివాళి – సీపీఎం
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ
విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా 2000 సంవత్సరంలో విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిలకు అర్పిస్తున్న ఘనమైన నివాళి అని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ తెలిపారు. ఈరోజు స్థానిక సుందరయ్య భవన్లో సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన విద్యుత్ సంస్కరణ సభ జరిగింది. సభ కంటే ముందు రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిల చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు షరతులకు తలోగ్గిన నాటి తెలుగుదేశం ప్రభుత్వం విద్యుసంస్కరణలను చేపట్టింది. వామపక్షాల ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ మహో ఉద్యమం పోవేత్తున సాగింది. ఆగస్టు 28వ తేదీన హైదరాబాద్ లోని బషీర్బాగ్లో విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి రామకృష్ణులు అమరులయ్యారని ఆయన తెలిపారు. ఆ పోరాటం దేశవ్యాప్తంగా ప్రపంచ బాకు షరతులు అమలు గాకుండా నిలబెట్టిందని అది ఆ అమరవీరుల త్యాగాల ఫలితమే అని ఆయన తెలిపారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు విద్యుత్ వారాలు ప్రజలపై వేయాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని కొన్ని సంవత్సరాలపాటు ప్రజల పైన భారం లేకుండా ఆ పోరాటం చేయగలిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి, తెలుగుదేశం ప్రభుత్వాలు నేరుగా కాకుండా దొడ్డి దారిన ప్రజలపై విద్యుత్ వారాలు వేయడం కోసం మార్గాలు వెతుక్కున్నాయని ఆయన తెలిపారు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం 2021 లో విత్ సంస్కరణలు దేశవ్యాప్తంగా తీసుకొని వచ్చే ప్రయత్నం చేసిందని ఆ సంస్కరణను అందరికంటే ముందు రాష్ట్రంలో ఉన్న ఆనాటి వైసిపి ప్రభుత్వం అమలు చేయడానికి పూనుకున్నదని ఆయన విమర్శించారు. ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో 9863 కోట్ల రూపాయలు భారాలు వేసిందని ఆయన విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలతో లాలూచీపడి కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడికి తలకి రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని నాటి వైసిపి ప్రభుత్వం చేపట్టిందని దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించడం వల్ల తాత్కాలికంగా వెనుక తగ్గారని ఆయన తెలిపారు. స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు పెడుతుంటే తెలుగుదేశం పార్టీ అవే స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తిరిగి ప్రజలపై భారం వేయాలని చూస్తే ప్రజల్ని సమీకరించి ఇండియా కూటమికి వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే విద్యుత్తు అమరవీరులకు అర్పిస్తున్న ఘనమైన నివాళి అని ఆయన తెలిపారు. సిపిఎం పార్టీ వామపక్ష పార్టీ కార్యకర్తలు ఈ విద్యుత్ విధానాన్ని వ్యతిరేకంగా రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు రాధాకృష్ణ నారాయణ, వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు ఆనందబాబు, అరుణ ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67918