ఆంధ్రప్రదేశ్
జిల్లా ఆసుపత్రి లో ఖాళీగా వున్నా వైద్యుల పోస్టులను భర్తీ చేయండి. సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ. జిల్లా నాయకుడు గాలి రవిరాజ్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ .
నంద్యాల జిల్లాలో పేరుకే జిల్లా ఆసుపత్రి సమస్యలకు అది నిలయఆసుపత్రి అని సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ ఆరోపించారు. నంద్యాల జిల్లా ఆసుపత్రి లో ఖాళీగా వున్నా గుండెకు సంబందించిన డాక్టర్ మరియు ఊపిరితిత్తులకు సంబందించిన డాక్టర్ లేకపోవడంతో వాటికి సంబందించిన రోగులు ప్రైవేటు ఆసుపత్రికి పోయి ఆస్తులు గుల్ల చేసుకుంటున్నారని వారు ఆరోపించారు. సమస్యలకు నిలయంగా మారిన ఆసుపత్రి బాగోగులు ఎవరికి పట్టవా అని సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ అధికారులను నాయకులను సూటిగా ప్రశ్నించారు. ఆసుపత్రి ఆవరణలో పందులు కుక్కలు మరియు చెత్త చేదారం పెరుకపోయినా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారని వారు ఆరోపించారు. ఆసుపత్రి ఆవరణలో బైకులు వాహనాలు సరైన పద్ధతి లో పెట్టకపోవడం గేట్ ఎదురుగా ఆటోలు ఇష్టం వచ్చినట్టు పెట్టడం వలన అంబులెన్సు లకు ఇబ్బందులు పడుతున్నాయని పలుమార్లు విన్నవించుకున్న చెవిటివాడి ముందు శంఖం వూదిన చందంగా తయారైందని వారు ఆరోపించారు. పేసెంట్ల పట్ల నిర్లక్ష్య వైఖరి మారాలని వారిపట్ల సంయుక్తంగా వుండాలని వారు సూసించారు. డాక్టర్స్ పనివేళ్లలో పేసెంట్ ను చూసే సమయం లో సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా చూస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి లో నెల కొక సారి జరిపే సమావేశాలకు ప్రజా సంఘాలకు కూడా అవకాశం ఇస్తే అక్కడ వున్నా సమస్యలను తెలియజేసి వాటిని సరిచేసుకోవడానికి వీలుపడుతుందని వారు కోరారు. సమస్యలకు నిలయంగా మారిన జిల్లా ఆసుపత్రి లో సమస్యలు పరిష్కరించాలని లేని తరుణం లో ఆసుపత్రి ఆవరణంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక