ఆంధ్రప్రదేశ్
పోలీసులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి… కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్

ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు.
పోలీసులకు ఉచిత వైద్యపరీక్షలు .
ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ అన్నారు.
ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని హెడ్ క్వార్టర్స్ లోని మిని కాన్ఫరెన్స్ హాల్ లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
పోలీసు సిబ్బంది సంక్షేమమే ముఖ్యమన్నారు.
ప్రధానంగా పోలీసు సిబ్బంది ఆరోగ్యం కు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రతీ ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆరోగ్య సమస్యలుంటే ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఉచిత మెడికల్ క్యాంపును పోలీసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వాకింగ్, జాగింగ్ వంటి వాటికి కొంత సమయాన్ని కేటాయించి ఆరోగ్యంగా ఉండాలన్నారు.
పోలీసు అధికారులు , సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే వారు తమ విధులను చక్కగా నిర్వహించవచ్చన్నారు.
వైద్య శిబిరంలో పోలీసు సిబ్బందికి చికిత్స చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం జిల్లా ఎస్పీ పాటు , డిస్పీలు, సిఐలు, పలువురు పోలీసు సిబ్బంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
కర్నూలు మెడికవర్ హాస్పిటల్, క్రౌన్ డెంటల్, శ్రీ బాలా సాయి ఐ హస్పిటల్ ,లయన్స్ క్లబ్ అసోసియేషన్ డాక్టర్ల ఆధ్వర్యంలో పోలీసులకు బిపి, షుగర్, ఈ సి జి, 2d Eco, BMD , PFT, BMI, డెంటల్, హియరింగ్ టెస్ట్, కంటిచూపు పరీక్ష వంటి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా కంటి అద్దాలు కూడా అందజేశారు.
మొత్తం సుమారు 200 మందికి పైగా వివిధ అనారోగ్య సమస్యలతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
వారికి డాక్టర్లు తగిన సూచనలు, సలహాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిస్పీలు జె.బాబు ప్రసాద్, కృష్ణ మోహన్, పోలీసు వేల్పేర్ యూనిట్ హస్పిటల్ డాక్టర్ శ్రీమతి స్రవంతి , పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు, మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు…. గణేష్ కుమార్ రెడ్డి, మురార్జీ, వినోద్ ఆచారి, సర్వేరెడ్డి, తేజానందన్ రెడ్డి, మహేశ్వరరెడ్డి, జోష్న, క్రౌన్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ తేజ్ పెర్సీ, శ్రీ బాలా సాయి కంటి వైద్యశాల మరియు లయన్స్ క్లబ్ డాక్టర్లు జయప్రకాష్, రాయపాటి శ్రీనివాస్, రంగనాయకులు, ప్రభాకర్ రావు, ఆర్ ఐలు , ఆర్ ఎస్సైలు , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక