ఆంధ్రప్రదేశ్
ఇండస్ట్రియల్ పార్కులలో సమస్యల పరిష్కారానికి చర్యలు.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూలు సిటి
ఓర్వకల్లు, కొప్పర్తి, చిత్తూరు, తిరుపతి, విజయవాడ, గుంటూరు, పుట్టపర్తి, అనంతపురం పారిశ్రామిక పార్కులపై రివ్యూ*

రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కులలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, పుట్టపర్తి, అనంతపురం ఇండస్ట్రియల్ పార్కుల జీ.యంలు, జెడ్.యంలతో మంత్రి టి.జి భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓర్వకల్లు, కొప్పర్తితో పాటు ఇతర ఇండస్ట్రియల్ పార్కుల స్థలాలపై ఆరా తీశారు. ఏ పార్కులో ఎంత ల్యాండ్ ఉందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్కు స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూసుకోవాలన్నారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. దీంతోపాటు ఏపీఐఐసీ భూముల కోర్టు కేసులపై మంత్రి వివరాలు అడిగారు. పార్కుల వద్ద ఆర్చ్ ఏర్పాటుచేసి ఎంత విస్తీర్ణం ఉందో వివరాలతో పాటు, మ్యాప్ పెట్టాలని సూచించారు. ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తేనే పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఏపీకి వస్తున్నారన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136543