ఆంధ్రప్రదేశ్
చిత్తూర్ పట్టణం లో దొంగతనానికి పాల్పడిన డిల్లి మరియు ఉత్తరప్రదేశ్ కి చెందిన అంతరాష్ట్ర దొంగల అరెస్టు- వారి నుండి దొంగిలించబడిన రూ. 8,50,000/- విలువ కలిగిన 140 గ్రాముల బంగారు మరియు రూ. 350 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం.
ఏపీ టుడే న్యూస్ జనార్ధన్ రిపోర్టర్ చిత్తూరు సిటీ.
ఇటివల 15.08.2024వ తేదీన చిత్తూర్ పట్టణం లో కట్టమంచి నందు నివాసం ఉండు మునిక్రిష్ణ అను వ్యక్తి యొక్క తాళం వేసివున్న ఇంటి తలుపులు పగలగొట్టి బంగారు, వెండి నగలు మరియు నగదు దొంగలించిన సంఘటనపై చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడినది.
సదరు దొంగతనం కేసును చిత్తూర్ జిల్లా ఎస్.పి. శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐ.పి.ఎస్. గారి పర్యవేక్షణలో, చిత్తూర్ డి.ఎస్.పి శ్రీ సాయినాథ్ గారి ఆధ్వర్యంలో, చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం.జయరామయ్య గారి నేతృత్వంలో, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సి.లక్ష్మీకాంత్ మరియు ఇతర సిబ్బందితో బృందాలుగా ఏర్పడి డిల్లి, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రాంతాలలో ముమ్మర దర్యాప్తు చేసి ఉత్తరప్రదేశ్ మరియు డిల్లీకి చెందిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు మునిక్రిష్ణ ఇంటి తలుపులు పగలగొట్టి బంగారు, వెండి నగలు మరియు నగదు దొంగలించుకొని వెళ్లినట్టు గుర్తించి, సదరు అంతరాష్ట్ర దొంగలు ఇద్దరిని అరెస్టు చేయడం అయినది. దర్యాప్తులో భాగముగా సదరు అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యుల వద్ద నుంచి దొంగలించబడిన రూ. 8,50,000/- విలువ కలిగిన 140 గ్రాముల బంగారు, 350 గ్రాముల వెండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం అయినది మరియు ఈ కేసుకు సంబదపడిన మరొక ముద్దాయి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
దర్యాప్తులో సదరు దొంగల అంతరాష్ట్ర దొంగలు తాళం వేసివున్న ఇళ్ళను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిసినది.
అరెస్టు కాబడిన అంతరాష్ట్ర దొంగలు:
1) Naseem Shabi, Age 25 Yrs, S/O Late Khayum Shabi, Afrooli Village, Chandusi Mandal, Sambal Dist. U.P State.
2) Jansheer Pattan, Age 35 Yrs, S/o Chowhan Pattan, D.No. 271, 16th Street, Musthpabad, Old Delhi
పై దర్యాప్తులో పాల్గొన్న పోలీ స్ సిబ్బందిని చిత్తూర్ జిల్లా ఎస్.పి. శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐ. పి. ఎస్. మరియు చిత్తూరు డి. ఎస్. పి. శ్రీ సాయినాథ్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
First IO of the Case: WASI 2588, N.V Sridevi
దర్యాప్తులో పాల్గొన్న పోలీస్ సిబ్బంది
D. త్యాగరాజు, ASI 2919
V. సురేష్ బాబు, PC 3900
K. సుధాకర్, PC 4634
P. జనార్ధన్,PC 4598
C. రమేష్, PC 3263
S. రేనువాసులు, PC 3279
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87379