ఆంధ్రప్రదేశ్
మొక్కల్ని నాటుదాం…పర్యావరణానికి ఊపిరి పోద్దాం…కాలుష్యాన్ని తరిమికొడదాం…ఆరోగ్యంగా జీవిద్దాం : పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ

మొక్కల్ని నాటి, పర్యావరణానికిఊపిరి పోసి, కాలుష్యాన్ని తరిమికొట్టి, మనమందరం ఆరోగ్యంగా జీవిద్దామని పాణ్యo నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక రాయలసీమ యునివర్సిటీ ప్రాంగణంలో ఆమె శుక్రవారం ఉదయం “వన మహోత్సవం” కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. రావి, వేప, నాగమల్లి తదితర మొక్కలు నాటి మొక్కల పెంపకం ఆవశ్యకతను వివరించారు.
ఈ సందర్భంగా గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ
ఏపీలో పచ్చదనం పెంపొందించేందుకు మహాకూటమి ప్రభుత్వం మనం-వనం కార్యాక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. నేడు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు
, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారన్నారు.
వృక్ష సంపదతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుందన్నారు. హాయినిచ్చే నీడతో పాటు, అందమైన పూలు, ఫలసాయంతో మానవ జాతి మనుగడకు వృక్షాలు ఎంతో మేలు చేస్తాయన్నారు. కాలుష్యానికి విరుగుడుతో పాటు ఆరోగ్యానికి తోడు వృక్షాలేనన్నారు. గత కొన్నేళ్లుగా చెట్లను వివిధ రకాల అవసరాల పేరుతో విచ్చలవిడిగా కొట్టేయడంతో వాయుకాలుష్యం పెరిగిందన్నారు. కాలుష్య రక్కసి కారణంగా అనారోగ్య సమస్యలూ వెంటాడుతున్నాయన్నారు.
కాలుష్య నివారణకు మహాకూటమి ప్రభుత్వం ‘వన మహోత్సవం’ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో, రోడ్లకు ఇరువైపులా మొక్కల్ని నాటాలని.. వాటిని నాటి వదిలేయకుండా వాటిని పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. పచ్చదనం పెరిగితే రాష్ట్రం ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. కాలుష్య కోరల్లో నుంచి బయటపడొచ్చన్నారు. వృక్షో…రక్షితి రక్షితః అన్నారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు మరియు యునివర్సిటీ విద్యార్థులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87462