ఆంధ్రప్రదేశ్
ఐ ఎఫ్ టి యు 8వ అల్ ఇండియా మహసభను విజయవంతం చేయాండి.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
సెప్టెంబర్- 1,2 తేదీలలో పూణే నగరంలో జరిగే భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టియు) జాతీయ 8వ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ నంద్యాల పట్టణంలో ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం నంద్యాల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అజిత్ మహబూబ్ బాషా మాట్లాడుతూ
దేశంలో 3వ సారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించడంలో మొండిగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఇప్పటికే కార్పొరేటు శక్తులకు అప్పగించి శ్రామిక వర్గాన్ని కోలుకోలేని దెబ్బతీశారని కార్పొరేట్లాకి ఎర్ర తివాచి పరుస్తూ కార్మికులను బానిసలుగా మర్చే పెద్ద ప్రయత్నం జరుగుతుందని, పురోగమనం వైపు ఉండాల్సిన అభివృద్ధిని తిరోగమనం వైపు నడిపిస్తూ శ్రామికుల శ్రమ ను పెట్టుబడిదారులు మరింత దోచుకునే విధంగా నూతన చట్టాలను తయారు చేశారని అన్నారు. రాష్ట్రంలో కాంటాక్ట్ కార్మికులను, అసంఘటిత కార్మికులను పట్టించుకున్న నాధుడే లేడని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టాలకు వత్తాసు పలుకుతూ కార్మిక వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర కార్మిక వ్యతిరేక విధానాలపై శ్రామిక వర్గం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందులో భాగంగానే పూణే నగరంలో జరిగే 8వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భవన మరియు ఇతర నిర్మాణ కారుమ సంఘం డివిజన్ నాయకులు ఖాజా అప్సర్ మక్బూల్ రవి జుబేర్ ఖాజా పీర్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68093