ఆంధ్రప్రదేశ్
మెడికల్ కళాశాలను సందర్శించిన రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నూతన మెడికల్ కళాశాలలో సౌకర్యాలు మెరుగుపరుస్తాం.
నంద్యాల పట్టణంలో నూతనంగా నిర్మితమైన మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించే ఎంబిబిఎస్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోర్స్ కు అవసరమయ్యే అన్ని పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.
శుక్రవారం మెడికల్ కళాశాల ఆవరణలో నిర్వహించిన 75వ వన మహోత్సవ కార్యక్రమ అనంతరం నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాలను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారితో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ నూతనంగా నిర్మితమై ఉన్న మెడికల్ కాలేజీలో విద్యనభ్యసించే ఎంబిబిఎస్ విద్యార్థులకు అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ ల్యాబ్ లకు అవసరమయ్యే అన్ని పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆర్ఓ ప్లాంట్, ఫర్నిచర్, ల్యాబ్ పరికరాలు, లెక్చరర్ గ్యాలరీ, హాస్టల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై నివేదికలు ఇవ్వాలని కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆనంద్ కుమార్ ను మంత్రి సూచించారు.
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఎపీఎంఎస్ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను, కళాశాల అధ్యాపకులను ఆదేశించారు. అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ ల్యాబ్ లను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. మెడికల్ కళాశాలకు రెండు కొత్త బస్సులు వచ్చాయని డ్రైవర్లు లేని కారణంగా నిరుపయోగంగా ఉన్నాయని కళాశాల వైస్ ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎపీఎంఎస్ఐడిసి ఇంజినీర్ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన సదుపాయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి ,కలెక్టర్ కు నివేదించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక