ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 3 నుండి పొలం పిలుస్తోంది కార్యక్రమం : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల 3 నుండి జిల్లాలో పొలం పిలుస్తోంది కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో పొలం పిలుస్తోంది కార్యక్రమ గోడపత్రికను వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబరు 3 నుండి జిల్లా వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమం చేపట్టాలని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. ప్రతి మంగళవారం, బుధవారం వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి నూతన పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులు, పంటల మార్పిడి, ఎరువుల వాడకం తదితర వాటిపై వివరించి రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు వేసిన పంటలపై అధిక దిగుబడులు సాధించేలా సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, పశుసంవర్ధక అధికారి గోవింద నాయక్, మార్కెటింగ్ ఏడి రెహమాన్, వ్యవసాయ సాంకేతిక అధికారి అయూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87436