ఆంధ్రప్రదేశ్
ప్రజా పాలనే కూటమి ప్రభుత్వం లక్ష్యం.. ఎమ్మెల్యే సత్యానందరావు
రిపోర్టర్: జైదేవ్
కొత్తపేట నియోజకవర్గం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ప్రజా అవసరాలకు తగ్గట్టుగా పాలన…
సెలవు దినం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్ ల పంపిణీ పూర్తీ..
భారీవర్షంలో సైతం పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే…
ప్రజా అవసరాలకు తగ్గట్టుగానే తెలుగుదేశం,జనసేన,భాజపా పార్టీల కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు.రేపు ఒకటవ తారీఖు ఆదివారం సెలవు దినం కావడంతో ఈరోజే సామాజిక భద్రతా పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని వాడపాలెం,పలివెల,పొడగట్లపల్లి గ్రామాలలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పెన్షన్ ల పంపిణీ చేయడంలో వారికి అనువుగా ఉండే విధంగా కొన్నిసార్లు ఆలస్యంగా పంపిణీ చేసిన రోజులు ఉన్నాయని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వం ఉద్యోగులతో మొదటిరోజే పంపిణీ పూర్తి చేయడమే కాకుండా పెన్షన్ పంపిణీ రోజు సెలవు దినం వస్తే ముందురోజే పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొనడమే కాకుండా పంపిణీ చేసిన కూటమి నాయకులను,కార్యకర్తలను,ఉద్యోగులను అభినందించారు.
ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ చేయడం అంటే ప్రజలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఉన్న పాలనా దక్షతకు నిదర్శనం అని అలాగే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రజల పట్ల సేవాభావానికి తార్కాణం అని అన్నారు.గత వైసీపీ ప్రభుత్వంలా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సాకులతో వాయిదా వేయడం ఉండదని అవసరమైతే ముందుగానే అందించడమే ప్రజా ప్రభుత్వంమైన కూటమి లక్ష్యం అని సత్యానందరావు అన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68063