ఆంధ్రప్రదేశ్
రక్షక భట నిలయాల్లో సంరక్షక పెత్తనం ?
 
																								
												
												
											ఏపీ టుడే న్యూస్, కర్నూలు సిటి
. నిబంధనలకు విరుద్ధంగా మహిళా సంరక్షణ కార్యదర్శుల
  విధులు
• డిజిపి ఆదేశాలు క్షేత్ర స్థాయిలో బేఖాతర్
• అంతా తామే అన్నట్లుగా వ్యవహారం
• జిల్లా పోలీస్ బాస్ జోక్యం చేసుకునేనా?
గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో సరైన మార్గదర్శకాలు, ఉద్యోగ విధులు, పదోన్నతులు వంటివి రూపకల్పన చట్టబద్దంగా లేకపోవడంతో, ఉద్యోగుల్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే దీనిని ఆసరాగా చేసుకొని కొందరు మహిళా సంరక్షణ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పోలిస్ అధికారులను ప్రసన్నం చేసుకుని, రక్షక భట నిలయాల్లో తిష్ట వేసి తమ పెత్తనాలు చెలాయిస్తున్నారు. ఆపై తాము ఆడిందే ఆట, పాడిందే పాట అనే చందంగా వారి వ్యవహారం తయారైంది.
మహిళ సంరక్షణ కార్యదర్శుల సేవలు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో గత ఏడాది జులై 21న మహిళా సంరక్షణ కార్యదర్శులను సచివాలయకే పరిమితం చేయాలని అప్పటి డిజిపి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణ, బందోబస్తు, సాధారణ పోలీసు విధుల నిర్వహణ వంటివి గ్రామ/వార్డు సచివాలయాలోని మహిళ సంరక్షణ కార్యదర్శులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అప్పగించవద్దని అప్పట్లో డిజిపి స్పష్టంగా ఆదేశాలిచ్చారు. అప్పట్లో వారిని సచివాలయాలకే పరిమితం చేశారు. ప్రభుత్వం మారిన ఇప్పటి వరకు కూడా ఆ నిబంధనలు ఎటువంటి సడలింపులు చేయకపోయినా ప్రభుత్వం మారిందని, ఆ నిబంధనలు అందరూ మర్చిపోయారు అనుకున్నారేమో గాని జిల్లా వ్యాప్తంగా ఆ ఆదేశాలను క్షేత్ర స్థాయిలో పోలిస్ అధికారులు తుంగలో తొక్కుతున్నారు.
బదిలీ, పదోన్నతులు వంటి ఆదేశాలు లేకుండా, మౌఖిక ఆదేశాలతో మహిళా సంరక్షణ కార్యదర్శులను రక్షక భట నిలయాల్లో కూర్చొబెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వివిధ రకాల ఇవ్వకూడని అధికారాలను వారికి అప్పగించడాన్ని జిల్లా పోలీసు యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. రక్షక భట నిలయాల్లో అంతా తామే అన్నట్లుగా వారి వ్యవహారం సాగుతోంది. ఈ వ్యవహారం కర్నూలు నగరంలో అధిక సంఖ్యలో జరుగుతుంది. ఓ రక్షక భట నిలయంలో ఏకంగా షిఫ్ట్ వారిగా విధులు కేటాయించారు. ఇప్పటికైనా క్షేత్ర స్థాయిలో డిజిపి ఆదేశాలు బేఖాతర్ కాకుండా, మహిళ సంరక్షణ కార్యదర్శుల అనధికారిక విధులను అడ్డుకట్ట వేసి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌ను ప్రజలు కోరుతున్నారు.
- 
																	   జాతీయం7 months ago జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో) 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం 
- 
																	   ఆంధ్రప్రదేశ్6 months ago ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక 





 Total Users : 68052
 Total Users : 68052