ఆంధ్రప్రదేశ్
జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకొని వారికి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో, కర్నూల్ సిటీ
జాబ్ మేళాను యువతను సద్వినియోగం చేసుకోవాలి
సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం అనంతరం నైపుణ్యం అభివృద్ధి మరియు శిక్షణ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఉద్యోగ మేళా పోస్టర్లను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ శాఖ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలో భాగంగా వివిధ రకాలైన 10 ప్రైవేటు కంపెనీలలో ఉన్న 625 ఖాళీలను భర్తీ నిమిత్తం కర్నూలు నగరంలోని బిర్లా గేట్, బి.క్యాంపు పోస్టాఫీసు వద్ద ఉన్న నాక్ సెంటర్ లో ఇందులోని 5 వివిధ రకాల ప్రైవేటు కంపెనీలలో ఉన్న 350 ఖాళీలను భర్తీ కొరకు సెప్టెంబరు 3వ తేదిన జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది, అదే విధంగా మరో 5 వివిధ రకాల ప్రైవేటు కంపెనీలలో ఉన్న 275 ఖాళీలను భర్తీ కొరకు ఆలూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా సెప్టెంబరు 3వ తేదీన ఉ.9:గం.ల నుండి సా.5గం.ల వరకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. సదరు జాబ్ మేళా లో పాల్గొనాలనుకునే యువతీ, యువకులు 18 సం.ల నుండి 35 సం.ల లోపు ఉండడంతో పాటు పదవ తరగతి నుండి డిగ్రీ, బిటెక్, పిజి చదివిన వారు జాబ్ మేళాలో పాల్గొని ఉపాధి పొందే అవకాశం ఉంటుందన్నారు. అందుకు గాను ముందుగా కర్నూలు వారు https://forms.gle/1STUAB5Aq7LBr9gGA లో, ఆలూరు వారు https://forms.gle/SwB7N2tJFsfa7FZEA లింక్ లో సదరు వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
నైపుణ్య అభివృద్ధి శిక్షణా అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జాబ్ మేళాను యువత పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. జాబ్ మేళాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్న (కర్నూలు : ప్రశాంత్ 8142410410, మల్లికార్జున 9059290821), (ఆలూరు వీరేష్ 9010003132) నంబర్లకు సంప్రదించగలరని తెలిపారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఇంఛార్జి డిఆర్ఓ చిరంజీవి, ఉపాధి కల్పన అధికారి దీప్తి, నైపుణ్య అభివృద్ధి శిక్షణా అధికారి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక