ఆంధ్రప్రదేశ్
ప్రజల అర్జీలకు సంపూర్ణ పరిష్కారం
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూలు సిటి
నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం వచ్చే అర్జీలను సంపూర్ణంగా పరిష్కరించాలని కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి 17 అర్జీలు వచ్చాయి. వాటన్నింటినీ జవాబుదారీతనంతో గడువులోపు పరిష్కరించాలని అధికారులను కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్యధికారి విశ్వేశ్వర రెడ్డి, డిసిపి సంధ్య, ఆర్ఓ జునైద్, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, కార్యదర్శి నాగరాజు, టిడ్కో అధికారి పెంచలయ్య, డిపిఓ ఉమోష్ తదితరులు పాల్గొన్నారు.

*వచ్చిన అర్జీల్లో కొన్ని..*
1. టిడ్కో గృహాలకు అనర్హులు కాబడినందున తాము చెల్లించిన డిడి నగదును వెనక్కి ఇవ్వాలని కస్తూరి నగర్‌కు చెందిన ఈశ్వరయ్య, అశోక్ నగర్‌కు చెందిన లక్ష్మిప్రసన్న, కోట్ల రాణి, కొత్తపేటకు చెందిన రామలక్ష్మి, పి.మాబ్బి విరివిగా కోరారు.
2. నాగేంద్ర నగర్ నందు రహదారులు, మురుగు కాల్వలు నిర్మించాలని స్థానికులు కె.వెంకటేశ్వర రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి తదితరులు కోరారు.
3. వాసవి నగర్‌లోని తమ కాలనీలో తాగునీటి పైప్‌లైన్ నిర్మించాలని డి.కె. నాగేశ్వరరావు కోరారు.
4. చెక్‌పోస్ట్ సమీపంలో జోహరపురం రోడ్డున టీచర్స్ కాలనీ నందు రహదారి అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికుడు జంపాల మధుసూదనరావు ఫిర్యాదు చేశారు.
5. కల్లూరు పరిధిలో తమ భూమిని సర్వే చేసి సరిహద్దులు గుర్తించాలని యజమాని కె.వీరకుమార్ కోరారు.
6. సోమిశెట్టి నగర్, గౌతమ్ నగర్ కాలనీలలో రహదారి, మురుగు కాల్వలు నిర్మించాలని స్థానికులు రామస్వామి, భీమేశ్వర రెడ్డి, శ్రీనివాసులు, అశోక్ కోరారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67860