ఆంధ్రప్రదేశ్
పేద ముస్లిం అమ్మాయిలు అంజుమన్ ఆధ్వర్యంలో నిఖా చేసుకొని రూ. 50,000/- పొందండి.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
సామూహిక వివాహాలు సెప్టెంబర్ 22. అంజుమన్ అధ్యక్షులు నశ్యం ఖుద్దూస్.
గత పదిహేనేళ్ళుగా నంద్యాల అంజుమన్ కమిటి ఆధ్వర్యంలో పేద ముస్లీం యువతులకు సామూహిక వివాహాలు చేసి ఆర్థిక సహాయం అందించటం జరుగుతుంది. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ నెల 22-09-2024 ఆదివారం అంజుమన్ షాదిఖానాలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. సెప్టంబర్ నెల 19 వ తేది నాటికి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల అంజుమన్ లో పొందిన ధరఖాస్తులు పూర్తి చేసి, వధూవరుల ఆధార్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ ,ఫోటోలు జత చేసి ఇవ్వాలి. వధువు నంద్యాలకు చెంది 18 ఏండ్లు నిండి ఉంవలెను. మరియు అంజుమన్ షాది ఖానాలో సాముహిక వివాహ వేదికలో “నిఖా” చేసుకోవాలి. వివాహం రోజే వధువు పేర రూ.50,000/-నగదు చెక్కు ఇవ్వబడునని ,వరుడి నిఖా ఫీజు కూడా అంజుమన్ భరిస్తుందని నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. ఈ సందర్భంగా జమాఆతె ఇస్లామీ నంద్యాల అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్, మాట్లాడుతూ నంద్యాల పేద ముస్లిం వనితలకు ఇది మంచి అవకాశమని, తలిదండ్రులు తమ కూతూర్ల , బంధువులు అనాధల పెళ్ళిళ్ళు అంజుమన్ లో చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా ఓ స్వచ్ఛంద సంస్థ అమ్మాయిల వివాహానికి ఇంత భారీ మొత్తం ఇవ్వటం లేదు. నంద్యాల అంజుమన్ పెద అవివాహిత వనితలకు వరం, ఎక్కడో యాచించడం కన్న ముస్లిం ప్రజా సంస్థ అయిన అంజుమన్ సేవలు సద్వినియోగం చేసుకొనుటకు ముందుకు రావాలని, “షాది సాదికరో” అన్నట్లు నిరాడంబరంగా కట్నకానుకలు లేని వివాహాలు చేసుకోవాలని ముస్లిం సమాజానికి సమద్ అభ్యర్ధించారు. మరిన్ని వివరాలకు
నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ సెల్ ఫోన్ నంబర్ కు
9866242742 సంప్రదించాలని తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక