ఆంధ్రప్రదేశ్
ఎల్ఐసి ప్రీమియం లపై జిఎస్టి రద్దు చేసేదాకా ఉద్యమిస్తాం .. -ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక ..
కడప జిల్లా
జమ్మలమడుగు:సెప్టెంబర్03:


జమ్మలమడుగు పట్టణంలోని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) కార్యాలయం నందు మంగళ వారం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ జమ్మలమడుగు బ్రాంచ్ యూనిట్ సర్వసభ్యసమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కడప డివిజన్ అధ్యక్షులు అవధానం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎస్. అక్బర్ బాషా హాజరయ్యారు. ఈసందర్భంగా అవధానం శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల తమ ప్రచారఉద్యమం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి ప్రీమియంల పైన, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పైన జిఎస్టి రద్దుపై వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సమీక్షిస్తామనిప్రకటించారన్నారు. జీఎస్టీ రద్దు జరిగేదాకా తాము విశ్రమించమన్నారు. అనంతరం ఉపాధ్యక్షుడు అక్బర్ బాషా మాట్లాడుతూ సెప్టెంబర్ 14, 15 తేదీలలో కడపలో డివిజనల్ మహాసభ జరుగుతోందని, ఇందులో బీమా రంగ సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. కార్యక్రమం అనంతరం జమ్మలమడుగు బ్రాంచ్ యూనిట్ కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు అధ్యక్షుడుగా ఎ.బాలరాజు, ఉపాధ్యక్షుడు డి నరసింహం, కార్యదర్శి డి.వి. సుధాకర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎం.సతీష్, కోశాధికారి బి.శ్రీహరి నాయక్,
కార్యవర్గ సభ్యుడు కె.శ్రీధర్, డి.వి. సుబ్బయ్య, కే.సుబ్బరాయుడు, కే.నాగ రాజు, ఎస్ఎం భాష, వీ.జనార్ధనయ్య, బి.ప్రభావతమ్మలను ఎన్నుకున్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67908