ఆంధ్రప్రదేశ్
తిరుపతి ప్రజలకే నా ప్రజాజీవితం అంకితం: తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
తిరుపతి
తిరుపతి ప్రజల గెలుపు తన గెలుపని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించిన తిరుపతివాసులకు ముఖ్యంగా మహిళలకు, యువతకు, టీచర్లకు, ఉద్యోగులకు, కార్మికులకు, వ్యాపారస్థులు పేరుపేరునా కృతజ్జతలు ఆయన తెలిపారు. శ్రీవారి భక్తుడుగా ఆయన సన్నిధిలో ఎమ్మెల్యేగా గెలవడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశిశ్శులు, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీల దయ కారణమని ఆయన తన నివాసంలో జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పారు. తిరుపతి నియోజకవర్గం పట్ల పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక అభిమానం ఉందని ఆయన తెలిపారు. తిరుపతి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు తోడు చంద్రబాబు నాయుడు అనుభవం, నరేంద్ర మోదీ సహకారంతో కృషి చేయనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే తిరుపతిలోని ప్రముఖల నుంచి సలహాలు తీసుకుని వారిని తిరుపతి అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామని ఆయన తెలిపారు. తిరుపతిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని ఆరణి శ్రీనివాసులు పునరుద్ఘాటించారు. గడిచిన ఐదేళ్ళు తిరుపతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ప్రస్తుతం స్వేచ్చావాయులు పీలుస్తున్నారని ఆయన చెప్పారు. గత ఐదేళ్ళలో తిరుపతిలో జరిగిన అక్రమాలపై చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఆయన తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87450