ఆంధ్రప్రదేశ్
ఏ వ్యక్తి ఎదగడానికైనా వారి ఉన్నతిలో గురువుదే ప్రత్యేక స్థానం..ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
మనల్ని జ్ఞానవంతులుగా తీర్చి దిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది

తల్లి ప్రాణం ఇస్తుంది, తండ్రి భద్రత ఇస్తాడు, కానీ గురువు బతకడం నేర్పుతాడని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా , ఎం.ఎల్.సి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పాణ్యం ఎం.ఎల్.ఏ గౌరు చరితా రెడ్డిలతో కలిసి ఎం.పి పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనల్ని జ్ఞానవంతులుగా తీర్చి దిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిదన్నారు..ఏ వ్యక్తి ఎదగడానికైనా వారి ఉన్నతిలో గురువుదే ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు.. ఇక గత ప్రభుత్వం ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్న ఆయన, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎన్.డీ.ఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు..అంతకు ముందు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎం.పి, కలెక్టర్, ఎం.ఎల్.సి, ఎం.ఎల్.ఏ పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్, జిల్లా పరిషత్ సీ.ఈ.ఓ నసార రెడ్డి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు..
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68061