ఆంధ్రప్రదేశ్
వినాయక విగ్రహాల నిమజ్జన ఘాట్ పరిశీలన
నగరంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం నిర్వహించే కెసి కెనాల్ వినాయక ఘాట్‌ను గురువారం కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ అధికారులతో కలిసి పరిశీలించారు. వినాయక నిమజ్జన ఘాట్ వద్ద ప్రారంభమైన పిచ్చి మొక్కల తొలగింపు, పరిశుభ్రత వంటి పారిశుధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. నిమజ్జనానికి సంబంధించి నగర పాలక చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ అధికారులకు ఆదేశించారు. అనంతరం అధికారులతో కలిసి కమిషనర్ 17, 18వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించి, పలు సమస్యలపై చర్చించారు.
*మురుగు కాల్వకు అడ్డంకి తొలగించండి*
న
గరంలో కిమ్స్ హాస్పిటల్ సమీపంలో మురుగు కాల్వను కొందరు ప్రైవేటు వ్యక్తులు అడ్డంకి పెట్టినట్లు కమిషనర్ దృష్టి రాగ, గురువారం అధికారులతో కలిసి ఆయన ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. మురుగు కాల్వ ప్రవాహానికి ఆటంకం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆరోగ్యధికారి విశ్వేశ్వర రెడ్డి, డిసిపి సంధ్య, శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు, డిఈ నరేష్, ఏఈలు జనార్ధన్, భాను ప్రకాష్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ శబ్రీష్, శానిటేషన్ ఇంస్పెక్టర్ రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463