ఆంధ్రప్రదేశ్
వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలి
ఏపీ టుడే న్యూస్, బ్యూరో కర్నూలు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు
సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఏర్పాటుచేసిన అధికారుల సమావేశంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని అట్టి వారిపై నిఘా ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి డిఎస్పి శ్రీనివాసచారిని తహసిల్దార్ శేష ఫణి మరియు పట్టణ సీఐ సుదర్శన్ రెడ్డి లను ఆదేశించారు, అలాగే ఎంపీడీవో బంగారమ్మ,ను గ్రామాలలో ఉన్న సమస్యలను ఆరా తీశారు, గ్రామీణ ఎస్సై శ్రీనివాసులు ను గ్రామాలలో శాంతి భద్రతల విషయమై ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు,అలాగే సెబ్ సీఐ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ కర్ణాటక తెలంగాణ మద్యం రవాణా కాకుండా గట్టిగా నిఘా బందోబస్తు ఏర్పాటు చేశామని అక్రమ మద్యాన్ని రవాణా చేసే వారిపై వరస దాడులు చేస్తున్నామని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు తెలిపారు, మండల ఎంఈఓ ఆంజనేయులు ను మండలంలో ఒక్క టీచర్ ఉన్న పాఠశాలలో ఎన్ని ఇద్దరు టీచర్లు ఉన్న పాఠశాలలో ఎన్ని అసలు టీచర్లే లేని పాఠశాలలు ఎన్ని అని అలాగే పదవ తరగతి ఎంత పర్సంటేజీ ఫలితాలు వచ్చాయని ప్రశ్నించారు వ్యవసాయ అధికారి మహేశ్వర్ రెడ్డి ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో విజయకుమార్ ఫారెస్ట్ అధికారిని యమున, సిడిపిఓ సఫర్నిసా బేగం, ఆర్ అండ్ బి,డి ఈ నాగరాజు, హౌసింగ్ ఏఈ ప్రసాద్, పంచాయతి రాజ్ ఏ ఈ శివశంకర్ లను వారి వారి శాఖలలో ఉన్న అధికారాన్ని ప్రజల కోసం వినియోగించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదని ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా చూడాలని ప్రతి డిపార్ట్మెంట్ లోను ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు చేరేలా చూడాలని అందుకు ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని అధికారులను ఉద్దేశించి సబ్ కలెక్టర్ మాట్లాడారు
అనంతరం ఎమ్మిగనూరు వినాయక చవితి మండలి సభ్యులతో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ పట్టణంలో వినాయక చవితి మంటపాలలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాల దగ్గర ఇలాంటి ఘర్షణకు చోటు లేకుండా అలాగే ఊరేగింపు సమయంలో కూడా సంబరాలు జరుపుకుంటూ నిమజ్జనం చేసుకోవాలని గొడవలు సృష్టించకుండా శాంతియుతంగా జరుపుకోవాలని మండల సభ్యులకు సూచించారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463