ఆంధ్రప్రదేశ్
హంద్రీనది ఆక్రమణలు తొలగించి కర్నూలుకు మరో విజయవాడ పరిస్థితులు రాకుండా కాపాడండీ
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

ఈ సందర్భంగా రాయలసీమ యువజన విద్యార్థి సంఘాల నాయకు విఠల్ నగర్ లో హంద్రీనది ఆక్రమణలను సందర్శించారు ఈ సందర్భంగా నాయకులు వి.వి.నాయుడు, కురువ సంకన్న, రంగముని నాయుడు, సీమ క్రిష్ణా నాయక్ లు మాట్లాడుతూ వర్షాలు అధికశాతంలో నమోదు కావడంతో ఎన్నోచోట్ల వాగులు,నదులు,కాల్వలు పొంగి పొర్లుతున్న సందర్భంలో ఎన్నో చోట్ల వరదలకు గురవుతున్నాయి ఈ సందర్భంలో ఎంతోమంది ఆస్థి నష్టంతో పాటు ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో చిన్న వాగు వలన విజయవాడ పరిస్థితులు దారుణంగా తయారు అయింది, వాగులు,నదులు,చెరువులు, కబ్జాలకు గరైపోయి వరద ప్రవాహం పెరిగినప్పుడు నీళ్ళు వెళ్లే అవకాశం లేకుండా కబ్జాలు అవ్వడం వలనే ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. అలాంటి పరిస్థితులు మన కర్నూలులో సంభవించకుండా ముందు జాగ్రత్తగా కర్నూలు నడి ఒడ్డున పారుతున్న తుంగభద్రకు ఉపనది అయిన ఈ హంద్రీనదినీ కబ్జాకోరులు ఏకంగా వ్యాపారం మొదలు పెట్టారన్నారు, 2009 ఒకసారి మనకు గుణపాఠం అయింది ఈ రోజు విజయవాడ పరిస్థితులు ఎంత దారుణంగా అయ్యాయో రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు, కర్నూలు నగరంలో వాగులు, నదులు, చెరువులు కబ్జాలు చేసారన్నారు నిర్మాణాలు చేసారు, మనకు కూడా ఈ కబ్జా కోరుల వలన వరదలు వచ్చే అవకాశం లేకపోలేదు అన్నారు, విఠల్ నగర్ లో అగ్రసేని రియల్టర్ ఏకంగా హంద్రీనదిలో నిర్మాణాలు చేసి కోట్లకు అమ్ముకున్నారు ఇలా ఒకరికొకరు తోడై హంద్రీనది వరద పారేందుకు స్కోప్ లేకుండా చేస్తున్నారన్నారు, ఈ అక్రమాలకు అధికారుల పాత్ర కూడా ఉంది అన్నారు, హైదరాబాదులో హైడ్రా చేస్తున్న పని దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది అన్నారు అలాగే కర్నూలులో కూడా వరదలనుండి కర్నూలు నగరానికి నష్టం జరగకుండా ఉండాలంటే బఫర్ జోన్ ఆక్ట్ ప్రకారం అక్రమ నిర్మాణాలను తొలగించాలి అన్నారు, ప్రజలు కూడా అక్రమంగా నిర్మాణాలు చేసిన వాటిలో ఇండ్లు కొనుగోలు చేసి నష్టం జరిగాక ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని అన్నారు తక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చి రియల్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జయన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87488