ఆంధ్రప్రదేశ్
మంత్రాలయంలో సెంట్రింగ్ కార్మికుడు దుర్మరణం….
మంత్రాలయంలో సెంట్రింగ్ కార్మికుడు దుర్మరణం
ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో నందవరం మండలం ఆలహర్వి గ్రామానికి చెందిన సెంట్రింగ్ కార్మికుడు M.రవి దురదృష్టవశాత్తు ఇండో సబ్జా పనిలో నిమగ్నమై అనుకోకుండా నాలుగు అంతస్థుల బిల్డింగ్ నుండి కాలుజారి కిందపడి దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలయంలోని రాగ సుధా కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న నాలుగు అంతస్తుల భవనానికి రోజువారి కూలీగా వచ్చిన M. రవి వయసు (సుమారు 35 సంవత్సరాలు) పైబడిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఉదయాన్నే పనికి వచ్చిన రవి అతడి తోటి కార్మికులు కలిసి ఉదయం 9 గంటలకే పని ముగించుకుని టిఫిన్ చేయడానికి దిగుతుండగా చివరి క్షణంలో ఇండో సబ్జాకు సెంట్రింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. సంఘటన జరిగిన వెంటనే బాధితుడ్ని దగ్గర్లోని ఎమ్మిగనూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడని వైద్యులు తెలిపారు.రవి మరణించడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. బాధితుడికి ఐదు మంది పిల్లలు కాగా వారిలో ఒక అబ్బాయి నలుగురు కూతుర్లు ఉన్నారు.కుటుంబ బాగోగులు చూసే రవి చనిపోవడంతో కుటుంబ సభ్యులు దిగ్భంధికి లోనయ్యారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని వారు కోరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87425