ఆంధ్రప్రదేశ్
వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయం.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్*
సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షలు అందించిన అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ
మంత్రి టి.జి భరత్‌కు రూ. 25 లక్షల చెక్కు అందజేత
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు అందించింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులు మంత్రి టి.జి భరత్‌ను కలిసి రూ. 25 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందని చెప్పారు. ప్రజలను వరద కష్టాల నుండి బయటకు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. రూ.25 లక్షలు అందించిన అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యాన్ని టి.జి భరత్ అభినందించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465