ఆంధ్రప్రదేశ్
నైతికతే నిజమైన స్వేచ్ఛ” జాతీయ స్థాయి ఉద్యమానికి నంద్యాలలో మంచి ఆదరణ.

సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
“జమాఆతె ఇస్లామీ హింద్, మహిళా విభాగం జాతీయ స్థాయిలో ప్రారంభించిన “నైతకతే నిజమైన స్వేచ్ఛా” ఉద్యమం నంద్యాలలో మంచి ఆదరణ పొందుతుంది. సెప్టెంబర్ 1 ఉద్యమ గోడ పత్రికను ఆవిష్కరిస్తు స్థానిక బాధ్యులు షేక్ అబ్దుల్ సమద్ క్యాంపన్ ను లాంఛనంగా ప్రారంభిస్తూ ఉద్యమ ఆవశ్యకత స్పష్టం చేసారు. స్వేచ్ఛ పేర ప్రజలు అనేక సామాజిక రుగ్మతల లో మమేకం అవుతున్నారని, మద్యం, మత్తు పదార్థాలు, విచ్చలవిడి వస్త్రాధారణ, విశ్రుంఖల లైంగిక జీవన విధానాలతో సమాజపు విలవలను హరిస్తున్నారని , ఈ నైతిక విలువలు గుర్తు చేయడానికి జాతీయ స్థాయిలో జమాఆతే ఇస్లామి హింద్ మహిళా విభాగం దేశవ్యాప్తంగా కర పత్రాల ద్వారా, కార్నర్ మీటింగులు, బహిరంగ సభలు, కళాశాలలో వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నారు. ఈ నేపధ్యంలో నంద్యాల మహిళా విభాగం నిరంతరం శ్రమిస్తుంది. వాడ వాడల మహిళా సదస్సులు నిర్వహించి నైతికతే నిజమైన స్వేచ్ఛ అని వివరిస్తుంది. మహిళలు ఉద్యమాన్ని స్వాగతిస్తు ఆదరిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో డా. అజీమున్నిసా ముఖ్య వక్తగా మాట్లాడుతు ప్రజలు నిరంతరం సెల్ ఫోన్ బానిసలై తమకు తెలియకుండానే అనేక చెడు రుగ్మతల లో కూరుకొని పోతున్నారని చివరికి మానవ సంబంధాల్లో అనురాగాలు దూరమై, ప్రాశ్చాత్య సంస్కృతి లో కొట్టుమిట్టాడుతు నీతి నియమాలు విస్మరిస్తున్నారని వాపోయారు . మానవులు తన జీవిత పరమార్థాన్ని గుర్తించాలని ఖుర్ఆన్, ప్రవక్త ముహమ్మద్ (స) భోధనల వెలుగులో వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కరీముల్లా,స్థానిక నాజిమా ఫిర్దౌస్, శ్రీమతీ ఫిర్దౌస్ బాను, శ్రిమతి ఆయెషా , జమీలుద్దీన్,ఫయాజ్, యూనూస్, షఫి మొదలగు కార్యకర్తలు, లెక్చర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు. జమాత్ కార్యాలయంలో, వీసీ కాలనీ, ఎస్బిఐ కాలనీలలో వివధ కార్యక్రమాలు నిర్వహించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక