ఆంధ్రప్రదేశ్
సెయింట్ ప్యాట్రిక్స్ అకాడమీ లో ఓనం వేడుకలు
రిపోర్టర్ : జైదేవ్
కొత్తపేట నియోజకవర్గం
రావులపాలెం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

రావులపాలెం సెయింట్ ఫ్యా ట్రిక్స్ అకాడమీలో శనివారం
ఓనం వేడుకలు అకాడమీ ప్రిన్సిపాల్ రెవరెండ్ బ్రదర్ మను మాథ్యూ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. అకాడమీ ప్రిన్సిపాల్ రెవరెండ్ బ్రదర్ మను మాద్యూ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో జరుపుకునే పండుగలలో ఓనం ఒక ప్రముఖమైన పండుగ, కేరళలో మలయాళ మాసం సింగం లో వచ్చే వరి కోత పండుగ. ఈ పండుగను అక్కడి ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు . తెలుగు ప్రాంతంలో సంక్రాంతి పండుగకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో కేరళలో కూడా ఓనం పండుగకు అంత ప్రాధాన్యత ఉన్నది. పండుగలు జరుపుకోవడం వలన ప్రజలు మధ్య ప్రేమ ఆప్యాయతలు మరియు బంధుత్వాలు పెరుగుతాయన్నారు. అకాడమీ కమ్యూనిటీ లీడర్ రెవరెండ్ బ్రదర్ సెలెక్స్ అరుణ్ మాట్లాడుతూ పండుగలు అనేవి ప్రజల మధ్య ఐక్యతను ఆనందాన్ని కలుగజేస్తాయి కాబట్టి అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలను జరుపుకోవాలని అప్పుడే నిజమైన ఆనందం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని సాంప్రదాయ వేషధారణలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87376