ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర మంత్రి టి.జి భరత్ చేతులమీదుగా సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలు*
దాతలను అభినందించిన మంత్రి టి.జి భరత్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఆపదలో ఉన్నప్పుడు చేయూతనిచ్చేందుకు ముందుకురావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీ.ఎం.ఆర్.ఎఫ్ కు మంత్రి టి.జి భరత్ చేతులమీదుగా పలువురు విరాళాలు అందించారు. ది కర్నూల్ క్లబ్ తరుపున రూ.5 లక్షలు, ది కర్నూల్ యునైటెడ్ క్లబ్ తరుపున రూ. 2 లక్షలు, కర్నూలు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ 4వ వార్డు తరుపున వార్డు ఇంచార్జి ఊట్ల రమేష్ బాబు, బూత్ ఇంచార్జీల ఆధ్వర్యంలో సేకరించిన రూ. 60 వేలు, 48వ వార్డులోని 3వ బూత్‌కు చెందిన కే.ఈ మధులతా గౌడ్ రూ.30 వేలు విరాళం ఇచ్చారు. దాతలు ఈ చెక్కులను మంత్రి టి.జి భరత్‌ను ఆయన కార్యాలయంలో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా దాతలను టి.జి భరత్ అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో చిన్నసహాయమైనా ఎంతో ఉపయోగపడుతుందని టి.జి భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ క్లబ్ సెక్రటరీ బాలచంద్రా రెడ్డి, జాయింట్ సెక్రటరీ చంద్రమౌలీశ్వర రెడ్డి, ట్రెజరర్ కే.ఈ శివరామ్ గౌడ్, ఈ.సి మెంబర్ దుర్గా ప్రసాద్ రెడ్డి, సలీం బాషా, ప్రెసిడెంట్ భీమేశ్వర్ రెడ్డి, సెక్రటరీ బలరాం, ట్రెజరర్ సుధాకర్ బాబు, జనరల్ సెక్రటరీ రాముడు, యేసు రత్నం, భూపాల్ రెడ్డి, సుగుణాకర్ గుప్త, ఊట్ల రమేష్, మన్సూర్ ఆలీఖాన్, కార్తీక్, బూత్ ఇంచార్జీలు, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466