ఆంధ్రప్రదేశ్
ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు 20వేలు చెల్లించాలి :….సిపిఐ
నంద్యాల జిల్లా రుద్రవరం
ఏపీ టుడే న్యూస్:
పెద్ద కంబలూరు శాఖ సమావేశము కార్యదర్శి ఎన్ రామాచారి అధ్యక్షతన సమావేశం జరిగినది .ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీ న్ ఆళ్లగడ్డ కార్యదర్శి కే భాస్కర్, రుద్రవరం మండల కార్యదర్శి బాల నరసింహుడు హాజరైనారు .
ఈ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఏఐవైఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు పి నర్సింహులు గారు హాజరైనారు
ఈ సందర్భంగా సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు, బాబాఫక్రుద్దీన్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలను కచ్చితంగా అమలు చేయాలని, రైతులకు ఇచ్చినటువంటి ఆసరా కింద 20,000 రూపాయలు సూపర్ సిక్స్ పథకాలను కచ్చితంగా అమలు చేయాలని, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని రైతులకు 50 శాతం సబ్సిడీతో డీజిల్ అందించాలని వ్యవసాయ పరికరాలు అందించాలని, పెట్టుబడి సాయం కింద ప్రతి సన్న చిన్న కారు రైతులకు ఎకరానికి 20వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వాలని, కౌలు రైతులకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి బడ్జెట్లో వారికి నిధులు కేటాయించి ఎలాంటిపూచి లేకుండా రెండు లక్షల వరకు వడ్డీ లేని రుణాలను బ్యాంకుల ద్వారా అందించి రుణ బాధల నుంచి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
అడ్వకేట్ నరసింహులు గారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం కమ్యూనిస్టులంతా పాటుపడాలని గ్రామ సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేసి గ్రామ అభివృద్ధికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చా రు. ఇందుకోసం నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు అందించడానికి సంసిద్ధంగా ఉంటానని తెలియజేశారు .
ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలు వెంకటేశ్వర్లు, నాగ నరసింహుడు, బాల నరసింహుడు, రామచంద్రుడు, క్లైమేట్ పావని, సరస్వతి, జయమ్మ మొత్తం పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68031