ఆంధ్రప్రదేశ్
విరాట్ విశ్వకర్మను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడవాలి
సమాజానికి అవసరమైన వృత్తులను విశ్వకర్మ సృష్టించారు.. ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
విరాట్ విశ్వకర్మ భగవాన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడవాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు తెలిపారు.. బీ.సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ కార్యాలయంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎం.పి, జాయింట్ కలెక్టర్ నవ్య తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సంధర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా, ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డారాన్నారు..
సృష్టికి ముందే విరాట్ విశ్వకర్మ జన్మించడంతో పాటు, సమాజానికి అవసరమైన వివిధ వృత్తులను ఆయన సృష్టించారన్నారు..కమ్మరి, వడ్ల, స్వర్ణకార, శిల్ప, కాంచరి వంటి వివిధ వృత్తులను సృష్టించి సమాజానికి అవసరమైన వస్తువులను తయారు చేసుకునేందుకు విశ్వకర్మ ఎన్నో సేవలు చేసారని, విశ్వకర్మ నాడు సృష్టించిన వృత్తుల వల్ల నేటికి అనేక కులాల వారు తమ వృత్తులతో ఉపాధి పొందుతున్నారని ఆయన తెలిపారు.. ఈ కార్యక్రమంలో బీ.సి సంక్షేమ అధికారి వెంకట లక్ష్మమ్మ, బిసి సంక్షేమ సంఘం నాయకులు , తదితరులు పాల్గొన్నారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 89093