ఆంధ్రప్రదేశ్
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ యూనిట్ ల ఏర్పాటుకు బ్యాంకర్లు సహకరించాలి

నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ యూనిట్ ల ఏర్పాటుకు బ్యాంకర్లు సహకరించాలని సంబంధిత బ్యాంక్ అధికారులను జాయింట్ కలెక్టర్ డా బి.నవ్య ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాల్ లో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల స్క్రూటినీ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ డా బి.నవ్య నిర్వహించారు.
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పశుసంవర్థ శాఖకు సంబంధించి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల స్క్రూటినీ కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. బ్యాంకర్ల నుండి దరఖాస్తు దారులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎల్ డి ఎమ్ ను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం ద్వారా సొంతంగా యూనిట్ ఏర్పాటు చేసుకున్న వారికైనా, బ్యాంకుల నుండి లోను తీసుకున్న వారికైనా 50 శాతం సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అందుకు గాను ఎల్డిఎమ్ తో సమన్వయం చేసుకొని యూనిట్ ల స్థాపనకు తగు చర్యలు తీసుకోవాలని పశుసంవర్థక శాఖ అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు 32 మంది లబ్ధిదారులు ఉండగా 2 యూనిట్లు గ్రౌండ్ అయ్యాయని మిగిలినవి ప్రాసెస్ లో ఉన్నాయని వాటిని కూడా త్వరితగతిన గ్రౌండ్ చేయాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఎల్డీఎం రామచంద్ర రావు, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసులు, ఎస్సీ/ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజమహేంద్రనాథ్, దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోఆర్డినేటర్ దిలీప్, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక