ఆంధ్రప్రదేశ్
సైబర్ ఫ్రాడ్, లోన్ యాప్ ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, సైబర్ నేరాలు అరికట్టండి జిల్లా ఎస్.పి.కి వినతి పత్రం. నంద్యాల ముస్లిం జేఏసి.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ఉపాధ్యాయుడు ఖలీల్ అహ్మద్ ఆత్మహత్య దుర్ఘటనను మరవకముందే, ఇంకొక లోన్ యాప్ బాధితుడు ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉంది అని ఎన్ఎంజేఏసీ దృష్టికి రావడంతో అప్రమత్తం అయిన నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ దృష్టికి వచ్చిందని తెలిపారు. గౌరవ అధ్యక్షులు ఎస్ ఎం డి అబులైస్, ఎస్ అబ్దుల్ సమద్ లు వెంటనే బాధితునికి కలిసి కౌన్సిలింగ్ ఇచ్చి, అతనిని ఎస్పీ గారి ద్వారా ధైర్యం కలిగించడం జరిగింది. బాధితుడు వివరిస్తు తన దగ్గర వ్యాపారానికి డబ్బు లేక వేరే దారి లేక లోన్ ఆప్ లలో చిన్న మొత్తాలు బాకీ తీసుకున్నానని, దానికి వారు రెండింతల డబ్బు నా నుంచి రాబట్టారని, ఎంత డబ్బు ఇచ్చినా ఇంకా ఇంకా ఇవ్వాలని తనను వారు బ్లాక్మెయిల్ చేసి వెధిస్తున్నారని, ఒకవేళ డబ్బులు ఇవ్వని పరిస్థితుల్లో తన ఫోటోలను తన కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ ద్వారా అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తయారు చేసి, తన దగ్గర బంధువులకు స్నేహితులకు తనకు తెలిసిన వారికి పంపిస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. సమాజంలో తనకు మంచి గౌరవం ఉందని కాబట్టి వారు ఇటువంటి పని చేస్తే తన పరువు పోతుందని బాధపడుతూ చెప్పాడు. ఎస్పీ అతని కేసును సైబర్ క్రైమ్ వారికి అప్పగించి కేసు నమోదు చేయమని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ, లోన్ యాప్ ల వలలో చిక్కుకున్న వారు తమ ఇంటి నుండి 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి రిపోర్టు చేయవలెనని లేదా Cyber crime.gov.in లో తమ కేసు నమోదు చేయాలి అని, ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదని ఆత్మహత్యల లాంటి చర్యల కు పాల్పడవద్దని వారు సైబర్ క్రైమ్ సేవలు తీసుకొనవలెనని, వారికి తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నంద్యాల ముస్లిం జేఎసి చొరవను అభినందించారు.
సిరివెళ్లలో చైన్ కంపెనీల బారిన పడి కూలీ,నాలీ చేసుకునే వందల మంది బాదితులు సుమారు నాలుగు కోట్ల రూపాయలు నష్టపోయి ఉన్నారని, కాబట్టి దీనిపై మరియు ఉపాధ్యాయుడు ఖలీల్ అహ్మద్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి సైబర్ నేరగాళ్లను కటకటాల వెనక్కి పంపాలని, జేఎసి నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఎస్పీ స్పందిస్తూ తాము తప్పక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సైబర్ క్రైమ్ గురించి నంద్యాల ముస్లీం జేఎసి త్వరలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు అబులైస్, సమద్ తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87487