ఆంధ్రప్రదేశ్
కర్నూలు నుండి విజయవాడకు రైలు సౌకర్యం కల్పించండి*
.రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణను కోరిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్
*..ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించిన మంత్రి టి.జి భరత్*
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు టౌన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు రైలు సౌకర్యం కల్పించాలని రైల్వేశాఖ సహాయ మంత్రి వి. సోమణ్ణను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సోమణ్ణను రాష్ట్ర మంత్రి టి.జి భరత్ కలిసి రైల్వే సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర రాజధాని అమరావతికి రైల్ నెట్ వర్క్ సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. ఇదే సమయంలో కర్నూలు నుండి రాజధాని అమరావతికి ప్రత్యక్ష రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వ్యాపార కార్యకలాపాలతో సహా అధికారిక పనులకు హాజరు కావడానికి అమరావతి చేరుకోవడానికి ఎంతో కష్టంగా ఉందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ పారిశ్రామిక కేంద్రం అభివృద్ధి చెందుతోందని వివరించారు. కర్నూలు జిల్లాలో అనేక వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి మంత్రి టి.జి భరత్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ముంబైతో కర్నూలు జిల్లా పారిశ్రామికవేత్తల వ్యాపార కనెక్టివిటీని మెరుగుపరచడానికి, కర్నూలు నుండి ముంబైకి వారంలో ఒకటి లేదా రెండుసార్లు రైలు సౌకర్యం కల్పించాలన్నారు. కర్నూలు టౌన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు రోజువారీ రైలు సర్వీసును కల్పించాలని మంత్రి టి.జి భరత్ కోరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477