ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ అధికారుల పై మండిపడ్డ ఎం.పి బస్తిపాటి నాగరాజు

సమస్యల పై ఫోన్లు చేస్తే కొంత మంది అధికారులు ఫోన్లు ఎత్తడం లేదు
అధికారులు పద్దతి మార్చుకోవాలి..ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ప్రభుత్వ అధికారుల పై కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మండి పడ్డారు.. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కోడుమూరు ఎం.ఎల్.ఏ బొగ్గుల దస్తగిరితో కలిసి ఎం.పి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పై అధికారులకు తాను స్వయంగా ఫోన్లు చేస్తే కొంత మంది అధికారులు ఫోన్లు ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అలాంటి అధికారులు పద్ధతి మార్చుకొని పని చేయాలని హెచ్చరించారు.. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. పోలిసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరపాలన్న ఎం.పి నాగరాజు.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను తప్పుదోవ పట్టించే వారిపై దృష్టి పెట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీ.ఆరో.ఓ చిరంజీవి, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక