ఆంధ్రప్రదేశ్
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే వరద
కడప జిల్లా,
ప్రొద్దుటూరు,
ఏపీ టుడే న్యూస్;
రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని ఎమ్మెల్యే నంద్యాల వరదారాజుల రెడ్డి అన్నారు. *”ఇది మంచి ప్రభుత్వం” 2వ రోజు కార్యక్రమం సోములవారిపల్లె పంచాయతీ పరిధిలోని ఈశ్వర్ రెడ్డి నగర్ నందు శనివారం ప్రారంభించగా ఎమ్మెల్యే వరద* ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత “ఇది మంచి ప్రభుత్వం” అని అనిపించుకుంటుందన్నారు. అవ్వ తాతల పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000, లక్షలాదిమంది పేదల ఆకలి తీర్చే “అన్న క్యాంటీన్లు”, యువత భవిష్యత్తుకు “మెగాడీఎస్సీ” ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ రద్దు, వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ప్రజల కోసమే పని చేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సోములవారిపల్లె పంచాయతీని పూర్తిగా అభివృద్ధి చేస్తామని రోడ్లు కాలువలను నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ నాయకులు, ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87488