Connect with us

ఆంధ్రప్రదేశ్

వంద రోజుల్లో ప్రజలకు ఎంతో మంచి చేసాం. ఇంటింటా ప్రచారం చేసిన 19 వార్డు ఇంచార్జ్ కోడూరు జగదీష్

Published

on

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని నంద్యాల పట్టణంలోని 19 వార్డ్ ఇంచార్జ్ కోడూరు జగదీష్ అన్నారు. 19 వార్డులో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నాయకులుతో కలిసి పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి వెళ్లిన కోడూరు జగదీష్ 100 రోజుల్లో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల నివేదికను ప్రజలకు అందించారు.ఈ సందర్భంగా 19 ఇంచార్జ్ కోడూరు జగదీష్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని, గత 5 ఏళ్లలో కనిపించని మార్పు ఈ వంద రోజుల్లో కనిపిస్తోందన్నారు.మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రశాంతంగా జీవించడం అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో  ప్రతివర్గానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు.సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తొలి 5 సంతకాలను ఐదు ముఖ్యమైన అంశాలపై పెట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై పెట్టి 16,437 ఉపాధ్యాయ నియామకాలకు పచ్చ జెండా ఊపారన్నారు.గతంలో ఉన్న 3 వేల పింఛనును వృద్ధులకు 4 వేలు, దివ్యాంగులకు 6 వేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని కొనియాడారు. ప్రతి నెలా 1వ తేదీనే పింఛను అందిస్తూ వారిని ఆదుకుంటున్నారని అన్నారు.గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేస్తే చంద్రబాబు ఒకేసారి 100 అన్నా క్యాంటీన్లను రీఓపెన్ చేసి 5 రూపాయలకే పేదలకుకడుపునిండా అన్నం పెడుతున్నారని అన్నారు. మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ ఎం డి ఫరూక్ కూడా నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కారం చూపుతున్నారని, విజయవాడ వరదల నేపథ్యంలో మంత్రి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసునన్నారు. ఎక్కడా విశ్రాంతి అన్నది లేకుండా పనిచేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580310
Total Users : 47994