ఆంధ్రప్రదేశ్
జాతీయ బీసీ చైతన్య సమితి
జాతీయ బీసీ చైతన్య సమితి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
బీసీల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఆపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ రమణ తెలిపారు. జాతీయ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా వడ్ల సుమంత్ ఆచారిని నియమించారు. ఇందుకు సంబందించి కర్నూలు లోని బీసీ వసతి గృహంలో సమావేశం నిర్వహించి బీసీ రమణ చేతుల మీదుగా సుమంత్ కు నియామక పత్రం అందించారు. ఈసమావేశంలో రమణ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీలకు పరిష్కారం కాని సమస్యల కోసం డిశంబర్ 5న దిల్లిలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. బీసీల సమగ్రాభివృద్ధి కోసం వెంటనే కులగణన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రి మండలి లో తీర్మానం చేసినందుకు రమణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 2029 ఎన్నికల లోపు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించే విధంగా తెలుగు దేశం పార్టీ కృషి చేయాలన్నారు. యువజన ప్రధాన కార్యదర్శి సుమంత్ మట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి యువజన విభాగం జాతీయ ప్రదాన కార్యదర్శిగా పదవి ఇచ్చినందుకు బీసీ రమణకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల సమస్యల కోసం పోరాటం చేస్తానని సుమంత్ తెలిపారు. ఏప్రభుత్వం లో నిరుద్యోగులకు న్యాయం జరగనందున నిరుద్యోగుల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిరుద్యోగ పాదయాత్ర చేస్తానన్నారు. రైతుల కోసం రైతు ఘోష యాత్ర చేస్తానని సుమంత్ ప్రకటించారు. విశ్వబ్రాహ్మణులకు ఏలాంటి సంక్షేమ పథకాలు లేనందున వారి వృత్తి కనమరుగు అయ్యే అవకాశం ఉందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విశ్వబ్రహ్మణుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మూలింటి సుదర్శన్, లక్ష్మణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Continue Reading
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466