ఆంధ్రప్రదేశ్
పులివెందుల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఐజీ కోయ ప్రవీణ్
ఏపీ టుడే న్యూస్,
కడప జిల్లా,
పులివెందుల;
పులివెందుల పోలీస్ స్టేషన్ ను సోమవారం సాయంత్రం కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తనిఖీ చేసి స్టేషన్ లోని పలు రికార్డులను, పరిసరాలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పరిశీలించారు. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పులివెందుల పట్టణంలో నెలరోజులుగా ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు దొంగతనాలను అరికట్టేందుకు కొన్ని ప్రణాళికలు చేపట్టారని అన్నారు. పాత నేరస్తులను విచారించడం వలన 9 పాత కేసులు విచారించగా నాలుగు లక్షల 50 వేలు నగదు రికవరీ అయిందని తెలిపారు. అందులో భాగంగా పటిష్టమైన చర్యలు చేపడతామన్నారు. పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐ లు, పోలీసులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87520