ఆంధ్రప్రదేశ్
కమతం ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ఇది మంచి ప్రభుత్వం
ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప – నంద్యాల జిల్లా –
*శిరివెళ్ళ:(యర్రగుంట్ల);* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాల మేరకు సిరివెళ్ల మండల పరిధిలోని ఎర్రగుంట్ల మేజర్ పంచాయతీ సచివాలయం 2లో తెదేపా యువ నాయకుడు కమతం ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ సద్దాం హుస్సేన్ ఇంటింటా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
యర్రగుంట్ల గ్రామంలో ఇంటింటా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం అధికారులతో కలిసి కమతం ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం, సూపర్ సిక్స్ పథకాల అమలు మరియు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి వివరించారు.
అదేవిధంగా కూటమి ప్రభుత్వం మహిళలకు దీపావళి రోజున దీపం పథకం కింద గ్యాస్ ఉచితంగా అమలు చేయబడుతున్నదని మరియు మహిళలకు ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు నెలకు 1500 వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. డ్వాక్రా మహిళలకు 10 లక్షల సున్నా వడ్డీ రుణాలను అందజేయనున్నారు.
ఇలా అన్ని అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలు మన ప్రభుత్వం అమలు చేస్తుందని అందరికీ అన్ని అమలు జరిగేలా చూడాలని కమతం ఉదయ్ కుమార్ రెడ్డి అధికారులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, భూమా అభిమానులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87520