ఆంధ్రప్రదేశ్
తమకు ప్రాణాహాన్ని ఉంది రక్షణ కల్పించండి (వీడియో)
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
తమ పొలాన్ని ఆక్రమించి వెంచర్ గా మార్చారు
కర్నూలుకు చెందిన అబ్దుల్ సుకూర్, సయ్యద్ భాష, నూర్ అహ్మద్ వెల్లడి*
*2014 నుంచి పోరాడుతున్నాం న్యాయం జరగడం లేదు*
*న్యాయస్థానం ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ తో తమ పొలంలో పనులు చేసుకుంటున్నాం*
తమ పొలాన్ని ఆక్రమించుకొని వెంచర్ గా మార్చిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కర్నూల్ కు చెందిన అబ్దుల్ సుకూర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాకు వంశపార్యపరంగా వస్తున్న 3:60 మూడు ఎకరాల 60 సెంట్లు భూమి ఉందని అని ముగ్గురు అన్నదమ్ములకు మా పెద్దలు ఇచ్చారని తెలిపారు. సర్వేనెంబర్ 227-A3A కల్లూరు గ్రామం లో ఉందన్నారు. తమ పెద్దల ద్వారా సంక్రమించిన భూమిలో ముగ్గురు కుమారులు వారసత్వం కింద అబ్దుల్ సుకుర్ కి 1 :70 సెంట్లు, రెండవ కుమారుడికి సయ్యద్ భాషాకి 1 ఎకరా,మరియు నూర్ అహ్మద్ కి 90 సెంట్లు భూమి ఉంది. ఈ భూమిని వారి అవసరాల నిమిత్తం 2014లో మహమ్మద్ భాష(సీడ్ బాషా) మరియు మహమ్మద్ రఫీలకు నాలుగున్నర కోట్లకు అమ్ముకునేందుకు ఒప్పందం కుదిరించుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం 14 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు.మూడు నెలల గడువుతో.. ఆ గడువు కూడా అయిపోవడంతో అబ్దుల్ సుకుర్ డబ్బులు ఇవ్వమని అడగ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అప్పటినుంచి తమకు డబ్బులు ఇవ్వకపోగా తమ పొలంలో అనుమతులు లేకుండా దౌర్జన్యంగా వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించుకున్నారు. ఆసిఫ్ నగర్ గా పేరు మార్చారు. 2014 నుంచి ఇప్పటిదాకా తమకు రావాల్సిన డబ్బులు అడిగితే తమపై దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ ఆన్లైన్ లో తమ పేరు పైనే పొలం ఉందని కానీ తమ పొలాన్ని వెంచర్ గా మార్చి ప్లాట్లు గా అమ్మి వేశారని తెలిపారు. తమకు ఇప్పటికీ రైతు భరోసా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయని తెలిపారు. తమకు అన్యాయం జరగడంతో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని న్యాయస్థానం తమకు ఇంజక్షన్ ఆర్డర్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ తో తమ పొలంలో పిచ్చి మొక్కలు తొలగించినట్లు తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ తో తాము పొలంలో పనులు చేసుకుంటుంటే కొందరు తమపై దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు. తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమను బెదిరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. నర్సిరెడ్డి, వసంతు, మహబూబ్ బాషా, మహమ్మద్ రఫీ మరియు కొంతమంది నుంచి తమకు ప్రాణహాని ఉందన్నారు. న్యాయం చేయాలని కోరారు.
Continue Reading
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68163