ఆంధ్రప్రదేశ్
పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా టిఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీనరసింహులు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
నామినేటెడ్ డైరెక్టర్ పోస్ట్ లో అనంత నగరానికి పద్మశాలి ముద్దుబిడ్డకు అవకాశం*
నామినేటెడ్ పోస్టుల్లో కూటమి ప్రభుత్వం సమతూకం పాటించింది. సామాన్య కార్యకర్తలకు, పార్టీ కేడర్ కు ప్రాధాన్యం ఇస్తూనే బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు అగ్ర తాంబూలం అందించింది. వెరసి తొలి విడత నామినేటెడ్ పదవుల్లో సామాజిక సమతూకం పాటించింది. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పదవులు కట్టబెట్టారు. అనంతపురం నగరానికి చెందిన టిఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీ నరసింహులును పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అనంతపురం నగరానికి చెందిన పోతుల లక్ష్మీనరసింహులు బీఏ, బీఈడీ పూర్తి చేశారు. 2019వ సంవత్సరం జనవరి 8న తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నగర సమన్వయ కమిటీ సభ్యుడిగా, అనంతపురం నగర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రియల్ టైం స్ట్రాటజీ పార్లమెంట్ కోఆర్డినేటర్ గా పార్టీ తనకు అందించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం టిఎన్టియుసి జిల్లా అధ్యక్షుడిగా పోతుల నరసింహులు పార్టీ బాధ్యత నిర్వహిస్తున్నారు. వైసిపి పాలనలో ప్రజా పోరాటాలను చేపట్టారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా
నిర్వహించారు. 2024 లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి గెలుపులో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేసిన నామినేటెడ్ పోస్టులలో అనంతపురం నగరానికి చెందిన పోతుల లక్ష్మీ నరసింహులును పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించారు. తొలి విడత నామినేటెడ్ పదవులను ప్రకటించిన ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వంలో తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖా మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్, రాష్ట ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి కి పోతుల లక్ష్మీ నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68174