ఆంధ్రప్రదేశ్
పేరూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యాక్రమం. టిడిపి తోనే అందరికి సమన్యాయం…

ఏపీ టుడే న్యూస్,
యల్ యన్ మద్దిలేటి విలేకరి.
నంద్యాల జిల్లా రుద్రవరం:
తెలుగుదేశం పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని పేరూరు గ్రామంలోని యువ నాయకులు రామ్ నాథ్ రెడ్డి, రమణారెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాల మేరకు మండల పరిధిలోని పేరూరు గ్రామంలో టిడిపి నాయకులు రామ్ నాధ్ రెడ్డి,రమణారెడ్డి ఆద్వర్యంలో గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి వెనుకబడిందని మరోసారి వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రం 50 సంవత్సరాలు వెనుకబడి ఉండేదన్నారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని ఆశించి ఒక్క చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంతో సాధ్యమని అత్యధిక స్థానాల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు.
ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా100 రోజుల్లోనే అభివృద్ధి చేసి కూటమి ప్రభుత్వం తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకుందన్నారు.
పెంచిన పెన్షన్ల ను ఇవ్వడం తో పాటు దీపావళికి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ అమలు చేయడం ఖాయమన్నారు. మరో వారం లో కొత్త పింఛన్లకు ను శ్రీకారం చుట్టడం తో పాటు కొత్త రేషన్ కార్డు, రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు కూడా తెదేపా అవకాశం కల్పిస్తుందన్నారు.
రాబోవు రోజుల లో కూటమి ప్రభుత్వం మరింత అభివృద్ధి చేసి 2029 ఎన్నికల్లో కూడా తిరుగులేని శక్తిగా నిలబడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భూమా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక