Connect with us

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయిలో చైర్మన్ కేటాయించ వలసిన వ్యక్తికి డైరెక్టర్ గా కేటాయించడం బాధాకరం – జాతీయ బి. సి. సంక్షేమ సంఘము నాయకులు

Published

on

ఏపీ టుడే న్యూస్,
కడప జిల్లా,
ప్రొద్దుటూరు;

ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట కృష్ణ యాదవ్ జిల్లా కన్వీనర్ మాదాసు మురళి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కడప జిల్లా బీసీలలో మంచి గుర్తింపు కలిగి టిడిపి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి బచ్చల పుల్లయ్య కు కేవలం డైరెక్టర్ పదవి కేటాయించడం చాలా దారుణం అన్నారు. గత ప్రభుత్వం కడప జిల్లా లో బీసీల పై ఎన్ని కేసులు పెట్టిన లెక్క చేయకుండా కూటమికి గెలుపు కొరకు పోరాడి అత్యధిక స్థానాలను సాధించడంలో కీలక పాత్ర పోసించిన బి.సి ల పై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అన్నారు. ఎన్నికల ముందు మొత్తం బీసీలే మా వెన్నెముక అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చాక బీసీలకు తగిన గుర్తింపు గల పదవులను వారికే కేటాయించే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరుపున కోరుతున్నామన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునః పరిశీలించుకుని బచ్చల పుల్లయ్య కు చైర్మన్ పదవి కేటాయించాలని బీసీలకు అత్యున్నత ప్రాధాన్యత గల పదవులను కేటాయించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రొద్దుటూరు శాసనసభ్యుడు నంద్యాల వరదరాజు రెడ్డి ప్రధాన పదవులు బీసీలకే కేటాయించాలని ముఖ్యమంత్రి కి లేఖ రాయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల శ్రీనివాసచార్య, జిల్లా కార్యదర్శి కాలే దేవానంద్, సుబ్బరాజు, వడ్డే బాల పెద్దయ్య, గాండ్ల సాధికారక కమిటీ రాష్ట్ర సభ్యులు జి చిన్న పుల్లయ్య, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, రఘు, తదితరులు పాల్గొన్నారు

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580488
Total Users : 48172